Karnataka : సీఎంగా యడియూరప్పను తొలగిస్తే బీజేపీకి నష్టమే : సుబ్రహ్మణ్యస్వామి

యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే బీజేపీకి కష్టమేనని ఆపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

Karnataka : సీఎంగా యడియూరప్పను తొలగిస్తే బీజేపీకి నష్టమే : సుబ్రహ్మణ్యస్వామి

Karnataka Cm Yadu

Yediyurappa removes from CM : యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే బీజేపీకి కష్టమేనని ఆపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నాయి. సీఎం పదవి నుంచి యడియూరప్పను తొలగిస్తారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో యడియూరప్ప ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసారు. ప్రధాని మోడీనికూడా కలిసారు. అనంతరం తనను సీఎం పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలను ఖండించారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు.

అయినాగానీ సీఎం పదవి నుంచి యడియూరప్పను తొలగించబోతున్నారని వార్తలు కొనసాగుతునే ఉన్నాయి.జులై నెలలోనే సీఎం మార్పులు జరుగుతాయనే వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. బీజేపీ అధిష్ఠానాన్ని హెచ్చరించేలా ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తెచ్చిన తొలి నేత యడియూరప్ప అని..ఆయన సీఎంగా లేనందు వల్లనే 2013లో బీజేపీకి అధికారంలోకి రాలేకపోయిందని ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పుడు మరోసారి అదే తప్పు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చేసిన తప్పే చేస్తూ ఎందుకు ఇబ్బందులు కొని తెచ్చుకోవాటమన్నారు. యడ్డీని సీఎం పదవి నుంచి తప్పిస్తే బీజేపీకి కష్టమేనని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు.

సీఎం అయినాగానీ యడియూరప్ప పూర్తికాలంగా ఎప్పుడూ కొనసాగలేదనే విషయంతెలిసిందే. గతంలో కూడా ఆయన సీఎం అయినాగానీ కొంతకాలానికే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈక్రమంలో పలు నాటకీయ పరిణామాల మధ్య మరోసారి సీఎం పీఠాన్ని యడ్డీ అధిరోహించినా ఈసారి కూడా ఆయన పూర్తికాలం సీఎంగా కొనసాగే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. అదే గనుక జరిగితే..తనను సీఎం పదవి నుంచి తొలగించే పక్షంలో తన కుమారుడికి పార్టీలో సరైన స్థానాన్ని కల్పించాలని యడ్యూరప్ప బీజేపీ అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది.

కాగా..కర్ణాటక బీజేపీలో అతర్గత వ్యవహారాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. బయటకు కనిపించకపోయినా రాష్ట్రంలో నేతల మధ్య అతర్గత విభేదాలు కొన్ని నెలలుగా యడ్యూరప్పకు తలనొప్పిలా తయారయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో అనారోగ్యకారణాల వల్ల తాను సీఎంపదవికి రాజీనామా చేస్తానని ప్రధాని మోడీతో ప్రస్తావించినట్లుగాను..దానికి బీజేపీ అధిష్టానం ఆమోదించి సీఎం మార్పులు జరిగితే తన కుమారుడికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరినట్లుగా తెలుస్తోంది.