lakhimpur : కోర్టుకే కథలు చెబుతారా?లఖీంపూర్ కేసులో సాక్ష్యాల సేకరణలో లేటేంటీ? : UP ప్రభుత్వంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.సాక్ష్యాల సేకరణలోఎందుకింత లేట్ చేస్తున్నారు?అని ప్రశ్నించింది

lakhimpur : కోర్టుకే కథలు చెబుతారా?లఖీంపూర్ కేసులో సాక్ష్యాల సేకరణలో లేటేంటీ? : UP ప్రభుత్వంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

Supreme Court Fires Up Government Over Lakhimpur Kheri Case

Supreme Court fires UP government over Lakhimpur Kheri case : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేస్తు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. బుధవారం (అక్టోబర్ 20,2021) జరిగిన విచారణ సందర్భంగా యూపీ సిట్ దర్యాప్తు జరుపుతోన్న తీరును..సాక్షుల గురించి ఆలస్యానికి చెబుతోన్న కారణాలను సీజేఐ బెంచ్ తప్పుపట్టింది. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వారం రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. కేసు విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో సుప్రీకోర్టుకు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక కోసం న్యాయమూర్తులు గత రాత్రి నుంచి వేచి చూశారు.

 Read more : Lakhimpur Kheri : యూపీ సర్కార్‌‌పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

ఈ విచారణ సందర్భంగా..సీజేఐ వ్యాఖ్యానిస్తు..‘‘‘ ఈ కేసులో మీరు 34 మంది సాక్ష్యులను విచారించారు. నలుగురి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. మిగిలినవారివి ఎందుకు చేయలేదు? అంత పెద్ద ఘటనలో కేవలం నలుగురే సాక్షులా?!.. కేవలం నలుగురి వాంగ్మూలాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి? అని ప్రశ్నించారు.అంతేకాకుండా..ఈ కేసులో యూపీ ప్రభుత్వం..వారి సిట్ ఏం చేస్తున్నట్లు? హింసాకాండను చూసిన సాక్షులను గుర్తించడంలో ఎందుకు ఆలస్యమవుతోంది? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అదేమని ప్రశ్నిస్తే అర్థం పర్థం లేని సమాధానాలు చెబుతున్నారు. క్రైమ్​ సీన్ రీ కన్​స్ట్రక్షన్ అంటున్నారు. సెక్షన్ 164 కింద జరిగే సీన్ రీ కన్​స్ట్రక్షన్.. సాక్ష్యాలను సేకరించటానికి మీకేమి అడ్డంకులు ఉన్నాయి? మీ తీరు చూస్తే కేసును కావాలనే సాగదీస్తున్నట్లుగా ఉంది..మీరు ఏం చేసినా..ఈ కేసును ఓ అంతులేని కథగా మేం వదిలేయబోవడం లేదని మీరు గుర్తుంచుకోండి..’అంటూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

“ఇన్వెష్టిగేషన్ ఎప్పుడూ అంతులేని కథలుగా మిగలకూడదు. సాక్ష్యులను త్వరగా విచారించండి. వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయండి. ఈ కేసులో అభియోగాలు చాలా తీవ్రమైనవని మర్చిపోవద్దు..త్వరగా అన్ని వివరాలు కోర్టుకు సమర్పించండీ అంటూ యూపీ ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది.ఈ కేసులో వాదనలు పూర్తి అయిన తరువాత యూపీ ప్రభుత్వ న్యాయవాది హరీశ్ సాల్వే.. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం నిరాకరిస్తు.. అక్టోబర్ 26కు వాయిదా వేసింది. ఆ విచారణకు ముందే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

Read more : http://Ashish Mishra Arrest : లఖింపూర్ ఖేరి కేసులో నిందితుడు ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌

కాగా..అక్టోబర్ 3న యూపీలోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. వాహనంలో ఉన్న నలుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. అనంతరం మంత్రి కుమారుడితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ హింసాకాండకు సంబంధించి కేసులను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాత్, జస్టిస్ మిమా కోహ్లితో కూడిన సుప్రీం ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కొడుకు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు కావడం, సాగు చట్టాలపై రైతుల నిరసనలు ఇంకాస్త తీవ్రతరమైన క్రమంలో కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణపై దేశ ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు.రైతులు సాగిస్తోన్న ఉద్యమంలో ఈ ఘటన చివరిగా అక్టోబర్ 8న లఖీంపూర్ కేసును పరిశీలించిన కోర్టు.. మధ్యలో దసరా సెలవులు రావడంతో తిరిగి ఈరోజు అంటే అక్టోబర్ 20 నుంచి విచారణ ప్రారంభించింది. యూపీ సర్కారు తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా..ప్రభుత్వం చెప్పిన పలు వివరణలకు కోర్టు అభ్యంతరం చెప్పింది..

Read more : Lakhimpur Violence : రైతు హత్యలను ఖండించాల్సిందే..లఖింపూర్ ఘటనపై ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు

రెండు వారాల వ్యవదిలో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, నలుగురు వ్యక్తుల సాక్ష్యాలను రికార్డు చేశామని యూపీ సర్కారు తెలిపింది. దర్యాప్తులో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తంచేసింది. సాక్ష్యాల సేకరణలో ఆలస్యాన్ని కోర్టు అంగీకరించలేదు. మొత్తం 34 మంది సాక్షులను విచారించినా, అందులో కేవలం నలుగురి స్టేట్మెంట్లను మాత్రమే రికార్డు చేయడమేంటని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సాక్షుల భద్రతకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సూచించింది.లఖీంపూర్ హింస కేసును యూపీ ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నట్లుగా అనిపిస్తోందంటూ సీజేఐ బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా సాగిన దర్యాప్తు వివరాలు పేర్కొంటూ వారం రోజుల్లోగా మరో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.