బతికి వస్తారంట : ఐదేళ్లుగా ఫ్రిజ్ లోనే స్వామిజీ డెడ్ బాడీ

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 10:49 AM IST
బతికి వస్తారంట : ఐదేళ్లుగా ఫ్రిజ్ లోనే స్వామిజీ డెడ్ బాడీ

లుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో ఉన్నారని భక్తులు నమ్ముతున్నారు. పంజాబ్‌లోని లుధియానాలో నూర్‌మహల్ డేరా చీఫ్, దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ స్వామీజీ అశుతోష్ మహారాజ్ దివంగతులయ్యారని ఐదేళ్ల క్రితమే వైద్యులు నిర్థారించారు. 

అయినా సరే భక్తులు మాత్రం స్వామీజీ మృతదేహాన్ని మైనస్ 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజర్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. 2014, జనవరి 28న అశుతోష్ మహారాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి గురువు పార్థివ దేహాన్ని ఫ్రిజర్‌లో ఉంచటమేకాకుండా  24 గంటలూ కాపలా ఉంటున్నారు. అంతేకాదు..పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు డాక్టర్స్ టీమ్ గా వచ్చి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి స్వామీజీ మృతదేహాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ఐదేళ్ల నుంచి మృతదేహం పాడవ్వలేదని డాక్టర్స్ తెలిపారు.

1946లో బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని నఖ్లోర్‌లో జన్మించిన అశుతోష్ మహారాజ్ పెళ్లయిన అనంతరం భార్యా, పిల్లలను విడిచిపెట్టి దీక్ష తీసుకున్నారు. ఈ క్రమంలోనే 1983లో ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. నిత్యం సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేవారు. దేశ వ్యాప్తంగా అశుతోష్ మహారాజ్‌ పేరుతో 100 ఆశ్రమాలున్నాయి.