ఢిల్లీలో ఘర్షణలు : AAP Vs BJP మధ్యలో తాహీర్ హుస్సేన్

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 12:17 PM IST
ఢిల్లీలో ఘర్షణలు : AAP Vs BJP మధ్యలో తాహీర్ హుస్సేన్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..అనూహ్యంగా ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పేరు తెరమీదకు వచ్చింది.
 

ఐపీ స్టాఫర్ అంకిత్ శర్మ హత్యలో పాత్ర ఉందనే వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్ బాగ్ ప్రాంతంలో 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం కాల్వలో నుంచి శర్మ డెడ్ బాడీని బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఈ కాల్వ హుస్సేన్ ఇంటికి సమీపంలో ఉంది. హత్యకు శర్మ నాయకత్వం వహించారని శర్మ కుటుంబం ఆరోపిస్తోంది. అంకిత్ శర్మ హత్యలో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు తాహిర్. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.

2020, ఫిబ్రవరి 24వ తేదీన తన ఇంటికి నిరసనకారులు చొచ్చుకొచ్చారని, తర్వాత తాను పోలీసులను సంప్రదించడం జరిగిందన్నారు. అనంతరం పోలీసులు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారని, ఫిబ్రవరి 25వ తేదీన తిరిగి రాగా..ప్రజలు తనపై నినాదాలు చేయడం ప్రారంభించారన్నారు. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని పోలీసులు సూచించడంతో..తాను వెళ్లిపోవడం జరిగిందని..మరలా ఇంటికి రాలేదన్నారు. అక్కడ ఎవరు ఏమి చేశారో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. 

Tahir AAP
కానీ ప్రజల వెర్షన్ వేరేలా ఉంది. ఆదివారం జరిగిన అల్లర్లలో హుస్సేన్ చురుకైన పాత్ర పోషించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో హుస్సేన్ ఓ కర్ర పట్టుకుని కనిపించడం, ఇతరులు కూడా ఉండడం కనిపించింది. ఇతను బీజేపీ లీడర్ కపిల్ మిశ్రాకు వ్యతిరేకం. 

తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తన కుటుంబం ఇంటి నుంచి దూరంగా ఉండడం జరిగిందని వెల్లడించారు. తనను లక్ష్యం చేసుకోవడం చాలా తప్పన్నారు. 
హింసను ప్రేరేపించిన ప్రయత్నించిన వారు పార్టీలో ఎంతటి కీలకంగా ఉన్నా సరే..కఠినమైన శిక్ష విధించాలని పార్టీ భావిస్తోందని ఆప్ సీనియర్ లీడర్ సంజయ్ సింగ్ వెల్లడించారు. 
 

అసలు తాహిర్ హుస్సేన్ ఎవరు ? 
తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వార్డ నెంబర్ 59, నెహ్రూ విహార్ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. చంద్ బాగ్‌కు కేవలం ఏడు కిలోమీటర్ల పరిధిలో ఉంది. 2017లో మున్సిపల్ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 42 సంవత్సరాలున్న అతను 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడి క్యాండెంట్‌. రూ. 16 కోట్లు ఆస్తులను అఫిడవిట్‌లో చూపించారు. తాను వ్యాపారవేత్తనని, ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తన అఫిడవిట్‌లో వెల్లడించారాయన.  ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసలో 33 మంది మరణించారు. ఇందులో పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఐబీ స్టాఫర్ కూడా ఉన్నారు. 

Read More : కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం