Tata Motors : కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. పెరగనున్న ధరలు

కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే త్వరపడండి. వెంటనే కొనుగోలు చేయండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే..

Tata Motors : కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. పెరగనున్న ధరలు

Tata Motors

Tata Motors : కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే త్వరపడండి. వెంటనే కొనుగోలు చేయండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కార్ల ధరలు పెరగనున్నాయి. పలు కార్ల తయారీ కంపెనీలు రేట్లు పెంచాలని నిర్ణయించాయి.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఓవైపు కరోనా సంక్షోభం, మరోవైపు అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా ధరలు పెంచుతున్నాయి. వాహనాలు, విడిభాగాల తయారీకి ఉపయోగించే ఉక్కు, రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు పెరగడం, రవాణా చార్జీలు భగ్గుమంటుండడం వల్ల పలు సంస్థలు ధరల పెంపు బాటపడుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి, మెర్సిడెస్ బెంజ్, ఆడి సంస్థలు జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.

తాజాగా హోండా, టాటా మోటార్స్, రెనో కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నాయి. ధరలు పెంచేందుకు ఈ మూడు దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఉత్పాదక వ్యయంలో కొద్దిమేర అయినా సర్దుబాటు చేసుకునేందుకు ధరలు పెంచడం తప్పనిసరి అని ఆయా కంపెనీల అభిప్రాయం.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

భారత్ లో సిటీ, అమేజ్ వంటి మోడళ్లతో గణనీయంగా అమ్మకాలు సాగిస్తున్న హోండా ఇప్పటికే గత ఆగస్టులో ఓసారి ధరలు పెంచింది. క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఫ్రెంచ్ కంపెనీ రెనో భారత్ లో వచ్చే ఏడాది ఆరంభం నుంచి కొత్త ధరల శ్రేణిని ప్రకటించనుంది.