MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్… పుస్తకాలే లేవంటున్న నిపుణులు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం

దేశంలో మొదటిసారిగా ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రభుత్వం హిందీలో నిర్వహించబోతుంది. అయితే, దీనిపై వైద్య రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్… పుస్తకాలే లేవంటున్న నిపుణులు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం

MBBS in Hindi: తమ రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి హిందీలో ఎంబీబీఎస్ కోర్స్ ప్రవేశపెడతామని మధ్య ప్రదేశ్ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ హిందీలో ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు.

CM KCR: తెలంగాణ సాధన కోసం అనుసరించిన పంథాలోనే రైతు ఉద్యమం: సీఎం కేసీఆర్

2022-23 విద్యా సంవత్సరానికిగాను హిందీలో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తామని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. ప్రయోగాత్మకంగా భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో, మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలోనే కోర్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. దేశంలో మొదటిసారి తాము మాత్రమే హిందీలో మెడికల్ కోర్సు ప్రారంభిస్తున్నామని, మాతృభాషలో ఈ కోర్సు బోధిస్తున్న తొలి రాష్ట్రం తమదే అవుతుందని ఘనంగా ప్రకటించారు చౌహాన్. ఈ కోర్సు కోసం ఫిజియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ వంటి కోర్సులను హిందీలో రూపొందిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి కూడా వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై వైద్య రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి

హిందీలో ఎంబీబీఎస్ కోర్స్ నిర్వహించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ కోర్సుకు అవసరమైన, నాణ్యమైన పుస్తకాలు హిందీలో ఎక్కడ ఉన్నాయి అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన జర్నల్స్, ఇంగ్లీష్‍లోనే పబ్లిష్ చేస్తారని, అందువల్ల హిందీలో సరైన పాఠ్యపుస్తకాలు కనుక్కునేందుకే మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుందని మాజీ వీసీ డా.భరత్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, నిపుణులకే వదిలేయాలని ఆయన సూచించారు. అయితే, ఈ విమర్శలపై కూడా ప్రభుత్వం స్పందించింది. జపాన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలు మాతృ భాషలోనే మెడిసిన్ బోధిస్తున్నాయని, మన దేశంలో నాణ్యమైన పుస్తకాలు ఉన్నాయని, కాబట్టి క్వాలిటీ సమస్య రాదని ప్రభుత్వం చెబుతోంది.

Swine flu: స్వైన్ ఫ్లూ కలకలం.. పెరుగుతున్న కేసులు.. ఝార్ఖండ్‌లో నలుగురికి పాజిటివ్

ఇప్పటికే హిందీ భాషను ప్రోత్సహించేందుకు ఒక హిందీ యూనివర్సిటీని కూడా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు.. బీటెక్, పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను కూడా హిందీలో ప్రవేశపెట్టాలని ఆ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆరు కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సులను హిందీలోనే బోధించేందుకు సిద్ధమైంది.