CM KCR : BJPకి వ్యతిరేకంగా ఏకమవ్వటానికి ప్రాంతీయ పార్టీల ప్లాన్..దీదీ,మహారాష్ట్ర సీఎంలతో కేసీఆర్ భేటీ..

వ్యతిరేకంగా ఏకమవ్వటానికి ప్రాంతీయ పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం కేసీార్ త్వరలోనే సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎంలతో భేటీ కానున్నారు.

CM KCR : BJPకి వ్యతిరేకంగా ఏకమవ్వటానికి  ప్రాంతీయ పార్టీల ప్లాన్..దీదీ,మహారాష్ట్ర సీఎంలతో కేసీఆర్ భేటీ..

Ts Cm Kcr Key Comments On National Politics

TS CM KCR key comments on national politics : బీజేపీకి వ్యతిరేకంగా భారత్ లో ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయా? కమల దళానికి చెక్ పెట్టటానికి సీఎంలు ఏకమవతున్నారా? అంటే నిజమేనని అనిపిస్తున్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నానని ప్రకటించిన క్రమంలో నిజమేననిపిస్తున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు. గతంలో సీఎం కేసీఆర్ పలువురు నేతలను కలిసారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. ఈక్రమంలో దీదీ ఇప్పటికే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడినట్లుగా ప్రకటించారు.

Also read : Hizab Row : హిజాబ్ తో లోపలికి రావద్దని స్కూల్ బయటే నిలిపివేసిన టీచర్..తీసివేసి క్లాసులకు వెళ్లిన విద్యార్ధినిలు

మార్చి 3న వారణాశిలో ర్యాలీ : మమతా
ప్రాంతీయ పార్టీల భేటీ విషయంలో మమతా మాట్లాడుతూ..దేశ సమాఖ్యను బీజేపీ దెబ్బతీస్తోందని..దేశ సహాఖ్యను కాపాడటానికి యత్నిస్తున్నామని..దీంట్లో భాంగానే ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే పోరాడతామని అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీతోనే కాంగ్రెస్ మంచి సంబంధాలు లేవని..కాబట్టి కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే మా దారిలో మేం వెళతామని దీదీ స్పష్టంచేశారు. దీని కోసం ప్రధాని మోడీ నియోజకవర్గం అయినా వారణాశిలో మార్చి 3న ర్యాలీ నిర్వహిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు.

మరోపక్క సీఎం కేసీఆర్ కూడా బీజేపీపై తరచు మండిపడుతున్నారు.బీజేపీని పారగొడతామని ప్రతినలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతామని తెలిపారు. తెలంగాణలో ముచ్చింతల్ లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు పూర్తి అయ్యాక మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ థాక్రేను కలుస్తానని తెలిపారు. థాక్రే తనకు ఫోన్ చేశారని తెలిపిన కేసీఆర్ త్వరలోనే ఆయనతో సమావేశమవుతానని..మమతా బెనర్జీ హైదరాబద్ వస్తానని ఫోన్ చేసిన చెప్పారని కేసీఆర్ తెలిపారు.

Also read : Hijab Row : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాలో దేశం కోసం కొత్త పార్టీ పెట్టాలని అందరూ కోరుకుంటే తప్పకుండా పెడదామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఇది రాజకీయ ఫ్రంట్‌లు కాదు.. ప్రజలే ఫ్రంట్‌గా ఏర్పడాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్ధవ్ థాక్రేతో చర్చించేందుకు త్వరలోనే ముంబైకి వెళ్తానని కేసీఆర్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారని.. త్వరలో కోల్‌కతాకు కూడా వెళ్తానని ఆయన తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తప్పకుండా ప్రధాన పాత్ర నాదే వుంటుందని సీఎం ధీమా వ్యక్తంచేశారు. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలని.. అందరం కలిసి బీజేపీని భూస్థాపితం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పాలనపై తప్పకుండా విచారణ జరుగుతుందని తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేసీఆర్ విచారణ చేస్తే ఎవరేంటో తెలుస్తుందని..పవిత్రంగా ఎవరున్నారో తెలుస్తుందని సీఎం అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ గాంధీ సాక్ష్యాలు అడగడంలో తప్పు లేదని..నేను కూడా అడుగుతాను దీనికి బీజేపీ సరైన సాక్ష్యాలు చూపించే తీరాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా, ఎంపీగా అడిగే హక్కు రాహుల్ గాంధీకి వుందని..అలా అడిగితే సమాధానంచెప్పలేక రాహుల్ గాంధీ గురించి అసభ్యంగా మాట్లాడారని..చూపించే ధమ్ము లేకే బీజేపీ ఇలా మాట్లాడుతోందని మండి పడ్డారు కేసీఆర్.

Also read : Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్

యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని..మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలనలో 33 మంది బ్యాంకులను ముంచి పారిపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.