Hizab Row : హిజాబ్ తో లోపలికి రావద్దని స్కూల్ బయటే నిలిపివేసిన టీచర్..తీసివేసి క్లాసులకు వెళ్లిన విద్యార్ధినిలు

కర్ణాటకలో స్కూల్స్ తెరుచుకున్నాయి.మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ ప్రారంభమైంది.హిజాబ్ తో లోపలికి రావద్దని విద్యార్థినిలను స్కూల్ బయటే నిలిపివేసింది టీచర్..దీంతో హిజాబ్ తీసివేసి..

Hizab Row : హిజాబ్ తో లోపలికి రావద్దని స్కూల్ బయటే నిలిపివేసిన టీచర్..తీసివేసి క్లాసులకు వెళ్లిన విద్యార్ధినిలు

Hijab Ruckus In Karnataka (1)

Hijab ruckus in karnataka : క‌ర్ణాట‌క‌లో హిజాబ్‌ వివాదంతో స్కూల్స్, కాలేజీలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ హిజాబ్ వివాదం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో తిరిగి రాష్ట్రంలో స్కూల్స్ తెరుచుకున్నాయి. యధావిధిగా ముస్లిం విద్యార్థినిలలు హిజాబ్ ధరించే స్కూల్ కు వచ్చారు. ఈక్రమంలో ఓ టీచర్ వారిని గేటు బయటే అడ్డుకున్నారు. హిజాబ్ తీసివేస్తేనే లోపలికి రండీ..లేకుంటే రావటానికి వీల్లేదని గేటు బయటే నిలిపివేశారు. దీంతో విద్యార్థినుల బంధువులు యూనిఫాం వేసుకున్నారు లోపలికి వెళ్లటానికి అనుమతించాలని కోరారు. కానీ ఈ టీచర్ అంగీకరించలేదు.

Also read : Hijab Row : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

స్కూల్ లోపలికి రావాలంటే హిజాబ్ తీసివేయాలని..లేకుంటే లోపలికి రానిచ్చేది లేదని కరాఖండీగా చెప్పారు. దీంతో వేరే దారి లేక..అసలే కోవిడ్ వల్ల స్కూల్స్ కు దూరమైన విద్యార్థినిలు తప్పనిసరి పరిస్థితుల్లో హిజాబ్ ను తీసివేసి క్లాసులకు హాజరయ్యారు.కర్ణాటకలో ప్రారంభమై ఈ హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించడం స‌రికాదని, యూనిఫాంలో మాత్ర‌మే రావాల‌ని ఆంక్షలు విధిస్తున్న క్రమంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం ఇటీవ‌ల ప్రకటించింది. అయితే, నేటి నుంచి మ‌ళ్లీ కర్ణాటకలో స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి.

Also read : Pakistan ISI Hijab Row: హిజాబ్ వివాదాన్నిఅనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్: ఇంటెలిజెన్స్ వార్నింగ్

దీంతో మ‌ళ్లీ హిజాబ్ వివాదం మరోసారి మొదలైంది. మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి స్కూల్ కు వ‌స్తుండ‌ంటో ఓ టీచర్ వారిని గేటు బయటే అడ్డుకున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు గొడ‌వ పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

ఈ వీడియోలో..స్కూల్లోకి అడుగు పెట్టేముందే హిజాబ్ తీసేయాల‌ని టీచర్ చెప్పటం..దీంతో చివ‌ర‌కు హిజాబ్ తీసేసి విద్యార్థినులు స్కూల్ లోపలికి వెళ్లారు. హిజాబ్‌తోనే స్కూల్లోకి అనుమ‌తించాల‌ని ఉపాధ్యాయురాలిని త‌ల్లిదండ్రులు వేడుకున్న‌ా..ఆమె వినిపించుకోలేదు. కాగా.. హిజాబ్ వివాదంపై విచారణ ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Also read :  Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా