Covid-19 : కొవిషీల్డ్‌ అనుకుని యాంటీ రేబీస్‌ టీకా ఇచ్చింది.. నర్స్ సస్పెండ్!

కొవిడ్ వ్యాక్సిన్ అనుకుని పొరపాటున యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందో నర్స్.. మ‌హారాష్ట్ర‌లోని ఠాణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని హెల్త్ సెంట‌ర్‌లో ఈ ఘటన జరిగింది.

Covid-19 : కొవిషీల్డ్‌ అనుకుని యాంటీ రేబీస్‌ టీకా ఇచ్చింది.. నర్స్ సస్పెండ్!

Man Mistakenly Administered Rabies Vaccine Instead Of Covid 19

Anti Rabies Vaccine : కొవిడ్ వ్యాక్సిన్ అనుకుని పొరపాటున యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందో నర్స్.. మ‌హారాష్ట్ర‌లోని ఠాణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని హెల్త్ సెంట‌ర్‌లో ఈ ఘటన జరిగింది. క‌ల్వాలోని Aatkoneshwar హెల్త్ సెంటర్‌లో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు రాజ్ కుమార్ అనే వ్య‌క్తి వచ్చాడు. అక్కడే పనిచేస్తున్న Kirti Popere అనే నర్స్ అతడికి పొర‌పాటున యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్ (ARV) ఇచ్చింది. దాంతో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీర్తి పోప‌రేను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Wife Kidnapped Her Husband : విడాకులు కోసం ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేసిన భార్య

హెల్త్ సెంటర్ లో ఒకవైపు కొవిడ్ టీకా అందిస్తుండగా.. మరోవైపు ARV వ్యాక్సిన్ అందిస్తున్నారు. రాజ్ కుమార్ తెలియకుండానే ARV వ్యాక్సినేషన్ లైన్ క్యూలో నిలబడ్డాడు. విధులు నిర్వర్తించే నర్స్ కీర్తే పోపరే.. తనిఖీ చేయకుండానే అతడికి రేబిస్ టీకా ఇచ్చింది. కనీసం అతడి కేస్ పేపర్ కూడా చూడలేదు.

అసలు విషయం గమనించిన అధికారులు వెంటనే రాజ్ కుమార్ ఆస్పత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వ్యక్తి కేస్ పేపర్ పరిశీలించాల్సిన డ్యూటీ నర్సుదేనని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆమె నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి ప్రాణానికి ముప్పు వాటిల్లిందని తిరస్కరించలేమని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. అందుకే క్రమశిక్షణ చర్యగా నర్సును సస్పెండ్ చేసినట్టు పేర్కొంది
Bahubali : బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు.. ట్యాక్స్ చెల్లించలేదా??