Central Govt Focus On Social Media : సోషల్ మీడియాపై కేంద్రం ఫోకస్..త్వరలోనే కొత్త మార్గదర్శకాలు

సోషల్ మీడియాపై మరోసారి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Central Govt Focus On Social Media : సోషల్ మీడియాపై కేంద్రం ఫోకస్..త్వరలోనే కొత్త మార్గదర్శకాలు

Central Govt Focus On Social Media

Central Govt Focus On Social Media : సోషల్ మీడియాపై మరోసారి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలాగే ఏదైనా ఒక బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసే ఎవరైనా సరే దాని గురించి స్పష్టమైన సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10 లక్షల జరిమానా విధించనున్నారు.

తరచూ రూల్స్ బ్రేక్ చేస్తే రూ.50 లక్షల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీనిపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో పది రోజుల్లో ఎస్‌వోపీ విడుదల చేసే అవకాశం ఉంది.

Prophet row: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులు

కంపెనీల నుంచి, ఇతర వ్యక్తుల నుంచి ఉచితంగా వస్తువులు తీసుకుని వాటికి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేవారు.. అలా పొందిన వస్తువులకు ముందుగానే 10 శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వస్తువును వారు కంపెనీకి తిరిగి ఇచ్చేస్తే.. సెక్షన్‌ 194R కింద ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.