Viral Video: మామా..! లైఫంటే ఇట్లా ఉండాలె.. ఈ కోతి దర్జాచూస్తే మీరు కుళ్లుకోవటం ఖాయం..

కళ్లకు నల్లటి కళ్లద్దాలు, నెత్తిన ఎర్రటి పూలు ధరించి పూలరంగడులా తయారైన ఓ కోతి.. ఎంజాయ్ చేస్తూ అరటిపండు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: మామా..! లైఫంటే ఇట్లా ఉండాలె.. ఈ కోతి దర్జాచూస్తే మీరు కుళ్లుకోవటం ఖాయం..

Monkey

Viral Video: కొంతమంది లైఫ్‌ను కలర్ ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటారు. కానీ, వారికి ఎదురయ్యే సమస్యలతో సతమతమవుతూ డీలా పడిపోతుంటారు. మరికొందరు ఎన్ని సమస్యలున్నా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు. ఆ కోవకు చెందిందే కాబోలు ఈ కోతి.. దీని దర్జాచూస్తే వావ్ అనకుండా ఉండలేరు.

Crazy Job Offer: నెలకు రూ.6లక్షల ఉద్యోగం కావాలా..? ఓన్లీ చాక్లెట్లు రుచిచూడటమే.. ఆగస్టు వరకే అవకాశం..!!

అరటికాయ తింటూ ఎంజాయ్ చేస్తున్న కోతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఫిగెన్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో దీనికి తెలుసు’ అని శీర్షిక ఇచ్చింది.  పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే నాలుగు మిలియన్ల మంది వీక్షించారు. వేలాది మంది రీ ట్వీట్లు చేస్తూ ఆశ్యర్చాన్ని వ్యక్తంచేశారు. ఈ వీడియోలో కనిపించే కోతి ఊయల లాంటి ఓ తాడుపై పడుకొని ఉంది. నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని, నెత్తిన ఎర్రటి పూలు పెట్టి పూలరంగడులా కనిపిస్తుంది. అంతేనా.. ఎంజాయ్ చేస్తూ అరటి పండ్లు తింటూ ఫోజులిస్తుంది. ఈ వీడియోలో కోతి దర్జాను చూస్తే మీరు కుళ్లుకోవటం ఖాయం. ఇంతలా అది ఎంజాయ్ చేస్తుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వావ్.. లైఫంటే ఇలా ఉండాల అంటూ కొందరు కామెంట్లు చేస్తుండా, మరికొందరు ఇది ఆడకోతి కాబోలు.. అందుకే ఇలా ఎంజాయ్ చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.