Bihar Cabinet Expansion: బీహార్‌లో కొలువుదీరిన కొత్త మంత్రి వర్గం.. ఎక్కువ మంది తేజస్వి యాదవ్ పార్టీ నుంచే..

ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్‌లో జేడీ(యూ)తో కూడిన మహా‌కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar Cabinet Expansion: బీహార్‌లో కొలువుదీరిన కొత్త మంత్రి వర్గం.. ఎక్కువ మంది తేజస్వి యాదవ్ పార్టీ నుంచే..

Bihar Cabinet Expansion_

Bihar Cabinet Expansion: ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్‌లో జేడీ(యూ)తో కూడిన మహా‌కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ప్రభుత్వంలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. మొత్తం 31మంది మంత్రులుగా మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ ఫాగు చౌహాన్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఉన్నారు.

Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

బీహార్ లో నూతనంగా కొలువు దీరిన మంత్రి వర్గంలో ఆర్జేడీకి అధికంగా మంత్రి పదవులు దక్కాయి. ఆర్జేడీ పార్టీ నుంచి 16మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, నితీష్ కుమార్ పార్టీ జేడీ(యూ) నుంచి 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా నుంచి ఒకరు, ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలాఉంటే బీహార్ కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా మొత్తం 36 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం కొన్ని మంత్రి పదవులను ఖాళీగా ఉంచినట్లు కూటమి వర్గాలు తెలిపాయి.

Arvind Kejriwal: ఉచితంగా అందించే విద్య, వైద్యం తాయిలాలు కావు: అరవింద్ కేజ్రీవాల్

మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న మంత్రులను చాలా మందిని కొనసాగించారు. ఆ పార్టీ నుంచి మహ్మద్ జమా‌ఖాన్, జయంత్ రాజ్, షీలా కుమారి, సునీల్ కుమార్, సంజయ్ ఝా, మదన్ సాహ్ని, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి, లేషి సింగ్, విజయ్ కుమార్‌చౌదరి, బిజేంద్ర యాదవ్‌ లు ఉన్నారు. అదేవిధంగా ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, అలోక్ మెహతా, సురేంద్ర ప్రసాద్ యాదవ్, రామానంద్ యాదవ్, కుమార్ సర్వజీత్, లలిత్ యాదవ్, సమీర్ కుమార్ మహాసేత్, చంద్రశేఖర్, జితేంద్ర కుమార్ రాయ్, అనితా దేవి, సుధాకర్ సింగ్, ఇజ్రాయెల్ మన్సూరి, సురేంద్ర సింగ్, కార్తికేయ, షానవాజ్ ఆలం, షమీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అఫాక్ ఆలం, మురారి లాల్ గౌతమ్‌, సంతోష్ సుమన్ హిందుస్థానీ అవామ్ మోర్చా నుండి ప్రమాణ స్వీకారం చేశారు.