Supreme Court : మీడియావన్ ఛానల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్

ఈ కేసులో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. మీడియాన్ ఛానల్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు సీల్డ్ కవర్ లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించింది.

Supreme Court : మీడియావన్ ఛానల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్

Supreme Court

Supreme Court : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మలయాళం న్యూస్ ఛానల్ మీడియావన్ కు బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ రెన్యూవల్ కు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. మీడియావన్ ను బ్యాన్ చేయాలని తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు నిరాకరించిన కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.

ఈ కేసులో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. మీడియాన్ ఛానల్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు సీల్డ్ కవర్ లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించింది.

Adani-Hindenburg Row: అదాని, హిండెన్‌బ‌ర్గ్ నివేదిక వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు.. సెబీ, కేంద్రానికి కీల‌క సూచ‌న‌లు

మైనార్టీ అనుకూలమైన వార్తలను ఆ ఛానల్ లో ప్రసారం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొందని, యూఏపీఏ, ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఆ ఛానల్ ప్రోగ్రామ్ లను ప్రసారం చేసిందని ఆరోపణలు ఉన్నాయని కానీ, అందులో వాస్తవం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అలాగే, టెర్రరిస్టు లింకులకు సంబంధించి ఆ ఛానల్ లో చూపించలేదని పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు గాలి మాటల ద్వారా చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురు అయింది.