Union Government : సెంట్రల్ యూనివర్సిటీల్లో 11,000 అధ్యాపక పోస్టులు ఖాళీ.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోని 45 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా, 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Union Government : సెంట్రల్ యూనివర్సిటీల్లో 11,000 అధ్యాపక పోస్టులు ఖాళీ.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Union Government

Union Government : దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోని 45 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా, 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఐఐటీల్లో 11,170 పోస్టులు మంజూరవ్వగా, 4,502 ఖాళీ పోస్టులున్నాయని పేర్కొన్నారు.

ఐఐఎంలలో మంజూరైన పోస్టులు 1,566 కాగా, 493 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పారు.కేంద్ర యూనివర్సిటీలు, ఐఐఎంలలో ఖాళీగా ఉన్న పోస్టులో 961 పోస్టులు ఎస్సీ రిజర్వ్ డ్, 578 పోస్టులు ఎస్టీ రిజర్వ్ డ్, 1657 పోస్టులు ఓబీసీ కేటగిరి కింద ఉన్నాయని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరిలో వరుసగా 643, 301 ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

CSU Recruitment : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్ సీఎల్ టీ)లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ సీఎల్ టీకి వేర్వేరు ప్రాంతాల్లో బెంచులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికి గానూ మొత్తం 1 ప్రెసిడెంట్ తోపాటు 31 మంది జ్యూడీషియల్, 31 మంది టెక్నికల్ సభ్యులు ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం 1 ప్రెసిడెంట్ తోపాటు 18 మంది జ్యూడీషియల్, 19 మంది టెక్నికల్ సభ్యులే పని చేస్తున్నారని పేర్కొన్నారు.