Corona Vaccination : మూడో దశ వ్యాక్సినేషన్‌పై నీలినీడలు

దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇవాళ్టి నుంచే.. మూడో దశ వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అయితే ఇది అసాధ్యమంటున్నాయి చాలా రాష్ట్రాలు.

Corona Vaccination : మూడో దశ వ్యాక్సినేషన్‌పై నీలినీడలు

Third Stage Vaccination From Today‌

Third stage corona vaccination : దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇవాళ్టి నుంచే.. మూడో దశ వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అయితే ఇది అసాధ్యమంటున్నాయి చాలా రాష్ట్రాలు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారిలో.. 75 శాతం మందికి రెండో డోస్‌కు సరిపడా వ్యాక్సిన్‌ ప్రస్తుతం అందుబాటులో లేదనేని రాష్ట్రాల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మూడో దశ వ్యాక్సినేషన్‌ చేపట్టాలంటే.. అది తమ వాళ్ల కాదంటూ చేతులెత్తేశాయి అన్ని రాష్ట్రాలు. అయితే ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేస్తోంది. రాష్ట్రాల వద్ద కోటి వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయంటోంది కేంద్రం.

18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి మే1 నుంచి వ్యాక్సినేషన్‌ ఇవ్వలేమని కేరళ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించాయి. వ్యాక్సిన్‌ కొరత కారణంగా.. మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌న ఆపేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రకటించింది. తెలంగాణ సర్కార్‌ కూడా రెండు రోజులు టీకా పంపిణీని బంద్‌ చేసింది. ఇక తమ వద్ద వ్యాక్సిన్‌ నిల్వలు లేవని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. తాము సీరమ్‌ నుంచి 67 లక్షల సీరమ్‌ వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తున్నామని.. ఇందులో మొదటి బ్యాచ్ మే 3న ఢిల్లీకి చేరనున్నాయని తెలిపారు.

అయితే రాష్ట్రాల వాదనను కేంద్రం కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద కోటి వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయని చెబుతోంది. రాష్ట్రాలకు మరో మూడు రోజుల్లో 20 లక్షల డోస్‌లు పంపుతామని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పింది కేంద్రం.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్‌ డిమాండ్‌ను తీర్చడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తిని పెంచాయి.. ప్రస్తుతం నెలకు 6 నుంచి 7 కోట్ల డోస్‌లు ఉత్పత్తి చేస్తోంది సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఇక భారత్‌ బయోటెక్‌ ఏప్రిల్‌లో 2 కోట్ల డోస్‌లు ఉత్పత్తి చేసింది.. మార్చిలో ఈ సంఖ్య కోటీ 50 లక్షలు మాత్రమే అని.. తాము కూడా డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచామని తెలిపింది..

ఏదేమైనా మే1 నుంచి మాత్రం ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఏపీ, తెలంగాణ, కేరళలో.. 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి ఇవాళ్టి నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించడం లేదు.