ఒకరు హిందూ, మరొకరు ముస్లిం జవాన్లు..ఎదురెదురుగా కూర్చొని ప్రార్థనలు

  • Published By: madhu ,Published On : August 13, 2020 / 08:52 AM IST
ఒకరు హిందూ, మరొకరు ముస్లిం జవాన్లు..ఎదురెదురుగా కూర్చొని ప్రార్థనలు

భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు.

తాజాగా ఇండియన్ ఆర్మీలో ఐక్యత ఏంటో చూపిస్తున్నారు ఇద్దరు జవాన్లు. ఒకరు ముస్లిం కాగా..మరొకరు హిందూ.. వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశం కోసం ప్రాణాలర్పించడమే కాదు..తమలో కూడా ఐక్యత ఉందని నిరూపిస్తున్నారు. ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి ఈ ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. సర్వ ధర్మస్థలం అనే షెడ్ కింద మందిరం, మసీదు ఉంది. తాము చెప్పకూడని చోట ఉన్నా..ఈ ఇద్దరు సోల్జర్స్ మాత్రం ఓ గోడకు ఉండి..ప్రార్థనలు చేసుకుంటుంటారు.

అద్భుత దృశ్యాన్ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఆర్మీలో మతసామరస్యానికి ఈ చిత్రం అద్దం పడుతోందని, దేశ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు నెటిజన్లు.