ఒడిషాలో Antivirus టిఫెన్ సెంటర్…

  • Published By: Chandu 10tv ,Published On : November 5, 2020 / 02:26 PM IST
ఒడిషాలో Antivirus టిఫెన్ సెంటర్…

“Antivirus” Tiffin Center : యజమానులు కస్టమర్లను ఆకర్షించటం కోసం, తమ వ్యాపారం సజావుగా జరగటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖంగా కొందరు పేరుతోనే ఆకర్షిస్తుంటారు. పేరులో ఏముందనుకుంటే పొరపాటు పడినట్టే అండోయో, ముఖ్యంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది తమ పేర్లు మార్చుకుని ట్రెండ్ సెట్ చేస్తుంటారు. ఇలా కొందరు అదృష్టం కోసం, మరికొందరు ట్రెండ్ కోసం మార్చుకుంటూ ఉంటారు. అలాంటిదే ఒడిషాలోని బరంపురంలో ఉండే ఓ హోటల్ యజమాని తన హోటల్ కు ట్రెండ్ సెట్ చేయటం కోసం ‘యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్’ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఆ టిఫెన్ సెంటర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



వివరాల్లోకి వెళ్తే… ఓడిశా బెర్హంపూర్‌లోని గాంధీనగర్‌ మెయిన్‌ రోడ్డులో ఈ యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌ ఉంది. మరీ ముఖ్యంగా ఈ టిఫిన్ సెంటర్ పేరు యాంటీవైరస్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే… దీని మెను బోర్డు మీద ఇడ్లీ, దోశ, వడ, పూరి, ప​కోడా వంటి అన్ని రకాల టిఫిన్లు ఇక్కడ లభిస్తాయి అని ఉంది. దీంతో పాటు ‘లివ్‌ ఆప్‌ ద ట్రెండ్‌’ అనే క్యాప్షన్‌ మెను బోర్డ్‌ పై కనిపిస్తుంది. ఇంకా కొంతమంది వ్యక్తులు సామాజిక దూరం పాటించకుండా అక్కడే నిల్చూని టిఫిన్ చేస్తున్నారు.



రెడిట్‌ యూజర్‌ ఒకరు దీనికి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఫోటో తెగ వైరల్ అవుతంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేయటం ప్రారంభించారు. ఒక యూజుర్ యాంటీ వైరస్‌ అనే పేరు వినబడగానే తాము ఇక్కడ ఎంతో శుచిగా, శుభ్రంగా ఉంటుందని భావించాం.. కానీ కనీసం ఇక్కడ కూర్చొని తినటానికి కూర్చీలు కూడా లేవని కామెంట్ చేశాడు. మరో యూజర్ మాత్రం మీల్స్ లో శానిటైజర్ కలుపుతున్నాడేమో చూడండి అంటూ కామెంట్ చేస్తే, మరో వ్యక్తి ఘూటుగా ఇక్కడ కేవలం ఏ గ్రేడ్ బ్లీచ్‌ పౌడర్ మాత్రమే వాడుతారంటూ కామెంట్ చేస్తున్నారు.



సోషల్ డిస్టెన్స్ ఒక్కటే కాదండోయో మరోక విషయం గుర్తించారు. అక్కడ చెఫ్ చేతులకి గ్లౌజ్, మాస్క్ , హెడ్ క్యాప్ పెట్టుకోకుండా వంట చేస్తే.. సర్వర్లు మాస్కులు, గ్లౌజులు ధరించకుండా చాలా శుభ్రంగా సర్వ్ చేస్తున్నారు. అబ్బో యాంటీవైరస్ లో ఇదో రకం కావచ్చు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నాడు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం యాంటీ వైరస్ పేరుతో ఉన్న ఈ హోటల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్న మాటే.

Antivirus Tiffin Center ! from r/india