Tomato Flu: టమాటో ఫ్లూ కలకలంతో కేరళ సరిహద్దుల వద్ద నిఘా పెంచిన తమిళనాడు ప్రభుత్వం
కేరళలో పిల్లలలో టమోటా జ్వరం కేసులు నమోదు కావడంతో కేరళతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులోని అన్ని చెక్ పోస్టులపై నిఘాను పెంచింది ప్రభుత్వం.

Tomato Flu: దేశంలో విష జ్వరాలు పాకుతున్నాయి. కేరళ రాష్ట్రంలో చిన్నారుల్లో వెలుగు చూసిన ‘టమాటో ఫ్లూ’ ఇతర రాష్ట్రాల్లోనూ గుబులు రేపుతోంది. ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్నీ కేంద్ర వైద్యారోగ్యశాఖ దృష్టికి తీసుకువెళ్ళింది. కేరళలో పిల్లలలో టమోటా జ్వరం కేసులు నమోదు కావడంతో కేరళతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులోని అన్ని చెక్ పోస్టులపై నిఘాను పెంచింది ప్రభుత్వం. దద్దుర్లు మరియు బొబ్బలు ఉన్న పిల్లలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రతి చెక్ పోస్ట్ వద్ద మూడు బృందాలను మోహరించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. పాలక్కాడ్ జిల్లా వాలాయార్ చెక్ పోస్టు, తిరువనంతపురం నుంచి కలియకావళి, తేని చెక్ పోస్టుల వద్ద..ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పటు చేశారు. ఐదేళ్ల లోపు పిల్లలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు తమిళనాడు వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య, పోలీసు, రెవెన్యూ బృందాలను సరిహద్దల వద్ద మోహరించారు.
Other Stories:Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు
కేరళలోని అనేక జిల్లాల్లో పిల్లల్లో టమోటా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అయితే వ్యాధి తీవ్రతను అంచనా వేయలేని వైద్యశాఖ అధికారులు..ఇప్పటికైతే వ్యాధి సోకిన చిన్నారులకు ప్రత్యేక అత్యవసర వైద్యం అందిస్తున్నారు. టమాటో ఫ్లూ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. చిన్నారుల ఒంటిపై దద్దుర్లు, బొబ్బలు వ్యాపించడం ఈ వ్యాధి లక్షణాలు. ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్నారులు బయట తిరగవద్దని, తరచూ వేడి నీరు తాగుతూ, బలవర్ధకమైన భోజనం తీసుకోవాలని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది.
Other Stories:Delhi Mundka fire: ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఇద్దరిపై కేసు నమోదు
- Kashmir Pandit Killing: కశ్మీర్లో పండిట్ హత్యకు వ్యతిరేకంగా భారీ నిరసనలు: కేంద్రం భద్రత కల్పించాలని విజ్ఞప్తి
- Gwalior Constable: డబ్బులడిగి విసిగిస్తున్నాడంటూ ఆరేళ్ల బాలుడిని గొంతు పిసికి చంపిన పోలీస్ కానిస్టేబుల్
- Tomato Flu Virus : కేరళలో టమాటా ఫ్లూ కలకలం..దాదాపు 10 కేసులు నమోదు
- Tomota Fever : కేరళను కలవర పెడుతున్న టమోటా ఫీవర్
- Sedition Act: దేశ ద్రోహం చట్టంపై కేంద్రం వైఖరిపై ఒక్క రోజు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు
1Zelensky: కేన్స్ వేడుకలో యుక్రెయిన్ అధ్యక్షుడి భావోద్వేగ ప్రసంగం
2Bigg Boss Nonstop: ఫైనల్ కు చేరిన బిగ్ బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
3Hardik Patel: కాంగ్రెస్కు షాకిచ్చిన హార్దిక్ పటేల్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
4RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!
5Benagaluru : ఆ కానిస్టేబుల్కు నలుగురు భార్యలు…!
6Bangalore Bell : బెంగుళూరు బెల్ లో ఉద్యోగాల భర్తీ
7Yogi Govt: కొత్త మదరసాల అనుమతికి నో చెప్పిన యోగి ప్రభుత్వం
8NCERT JOBS : ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీ
9Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
10IPL 2022: కేన్ మామ ఇక ఇంటికే.. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బ్రో!
-
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు
-
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు
-
India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
-
Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
-
Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం
-
Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధర అధికం
-
CM KCR : రాజ్యసభ అభ్యర్థులపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..ఆశావహుల్లో ఉత్కంఠ