ఇది విన్నారా : హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 01:20 AM IST
ఇది విన్నారా : హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా

హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. కరెక్టే కదా అంటారు కదా. కానీ ఆ వ్యక్తి నడిపింది బైక్ కాదు..ట్రాక్టర్. అయ్యో గిదెక్కడి చోద్యం అంటారా. అవును కొత్త మోటార్ వెహికల్ యాక్టు నిబంధన అమల్లోకి వచ్చాక కొత్త కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. చెప్పులు వేసుకుని వాహనం నడిపినా చలానా విధిస్తారని తెగ ప్రచారం జరిగింది. తాజాగా ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్ వేయడం..దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

గఢ్ ముక్తేశ్వర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌కు దేవేంద్ర కుమార్‌కు 2019, జులై 03వ తేదీ చలాన్ అందింది. దీనిపై తాను ఎంక్వయిరీ చేయగా హెల్మెట్ పెట్టుకోలేదని, లైసెన్స్ కూడా లేదని ఇందుకు రూ. 3 వేలు చెల్లించాలని ఉందని తెలిసిందన్నాడు. షాక్‌కు గురయ్యాయని, వెంటనే తాను అధికారులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపాడు. 

దీనిపై ట్రాఫిక్ ఇన్ చార్జీ అజయ్ వీర్ సింగ్ స్పందించారు. సంబంధిత కానిస్టేబు‌ల్‌తో తాను మాట్లాడడం జరిగిందని, చలాన్ విధించే క్రమంలో అధికారులు కంప్యూటర్‌లో టైప్ చేసినప్పుడు తప్పు జరిగిందన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది జరిగిందని, దీనికి సంబంధించిన చలాన్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు. 
Read More : అసోంలో పడవ ప్రమాదం : ఒకరి గల్లంతు