Uber Engineers : మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? ఉబెర్ లో ఇంజనీర్ల జాబ్స్

ఉబెర్ మంచి న్యూస్ వినిపించింది. ఔత్సాహిక ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ. బెంగళూరు, హైదరాబాద్ లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి కార్యాకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను ఎంపిక చేయాలని సంస్థ భావిస్తోంది.

Uber Engineers : మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? ఉబెర్ లో ఇంజనీర్ల జాబ్స్

Uber Engineers Jobs

Uber Engineers Jobs : కరోనా కాలం..అందరికీ కష్టాలు తెచ్చి పెడుతోంది. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడరాని కష్టాలు పడుతున్నారు. చదువుకు తగ్గట్లుగా జాబ్ దొరకడం లేదు కొందరికి. దీంతో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ..జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ తరుణంలో..ఉబెర్ మంచి న్యూస్ వినిపించింది. ఔత్సాహిక ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ.

బెంగళూరు, హైదరాబాద్ లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి కార్యాకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను ఎంపిక చేయాలని సంస్థ భావిస్తోంది. నిపుణులైన ఇంజనీర్లను నియమించుకుంటామని, ఈ బృందాల ద్వారా అన్ని గ్లోబల్ మార్కెట్లలో సవాళ్లను అధిగమించాలని భావిస్తున్నట్టు సంస్థ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మణికందన్ తంగరత్నం వెల్లడించారు.

ఫైనాన్స్ టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్‌ కప్లైన్స్‌, రైడర్, డ్రైవర్ వృద్ధి, మౌలిక సదుపాయాలు, డెలివరీ, ఈట్స్, అడ్టెక్, డేటా, భద్రత, టీంలను బలోపేతం చేయనున్నామని ఉబెర్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రవాణా రంగంలో కీలకంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ప్రపంచ డిమాండ్ కు అనుగుణంగా తమ బృందాలు పనిచేస్తాయని పేర్కొంది.

Read More : Covid-19 : ఏపీలో కొత్తగా 8,766 కరోనా కేసులు