Union Cabinet : ఎల్లుండే కేంద్ర మంత్రివర్గ విస్తరణ
కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు.

Union Cabinet Expansion
Union Cabinet : కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు. కేబినెట్ లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణపై ప్రధాన మంత్రి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసారు. మంత్రివర్గంలో స్ధానం దక్కించుకునే యుపి,బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన పలువురు నేతలుఢిల్లీ బయలుదేరారు. సింథియా,సోనోవాల్,సుశీల్ కుమార్ మోడీ,నారాయణ్ రానే,అనుప్రియా పాటిల్ లకు మంత్రి వర్గంలో స్ధానం దక్కినట్లు తెలుస్తోంది. వీరు కాక త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నాయకులకు మోడీ ప్రాదాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.
బిజెపి మిత్రపక్షాలకు చెందిన వారికి కూడా ఈవిడతలో కేబినెట్ లో స్థానం ఇవ్వనున్నారు. ప్రస్తుతం 53 మందితో ఉన్న మంత్రివర్గం 81 మంది వరకు మంత్రివర్గం విస్తరించుకునే అవకాశం ఉండటంతో మోడీ మిగిలిన 28 స్ధానాలను భర్తీ చేసే పనిలో ఉన్నారు.