మాస్క్ రూ.8, శానిటైజర్ రూ.100 : ధరలు ఖరారు చేసిన కేంద్రం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 01:08 PM IST
మాస్క్ రూ.8, శానిటైజర్ రూ.100 : ధరలు ఖరారు చేసిన కేంద్రం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రిటైల్ దుకాణాలే కాకుండా ఆన్ లైన్ సంస్థలు కూడా వీటి రేట్లను విపరీతంగా పెంచుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు అందరూ నోటికి మాస్కులు ధరిస్తున్నారు. ప్రజలు విరివిగా మాస్కులు, శానిటైజర్ కొనుగోలు చేస్తుండటంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక ధరలకు అమ్ముతున్నారు. దేశంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి. మాస్కుల ధర రూ.8, రూ.10గా, 200 ఎంఎల్ శానిటైజర్ ధర రూ.100గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ దోపిడీని అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశవాన్ హెచ్చరికలు జారీ చేశారు. 200 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ ధర రూ.100, మాస్క్ ధర రూ.10కి మించరాదని ఆయన ప్రకటించారు. ఈ ఆదేశాలు 30 జూన్ 2020 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 271కి చేరింది. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం అతి ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లకు డిమాండు విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని వాటి ధరలు పెంచి విక్రయిస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాస్కులు, శానిటైజర్లను 15 రెట్ల అధిక ధరకు కూడా అమ్ముతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటి ధరలను నియంత్రిస్తూ శనివారం కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.