UP పోలీసుల ప్రవర్తన.. BJP, Yogi Adityanath పరువుపోయేలా ఉంది: ఉమా భారతి

10TV Telugu News

UP పోలీసుల అనుమానస్పద ప్రవర్తన BJP రాష్ట్ర ప్రభుత్వ పరువుపోయేలా చేస్తుందని.. సీనియర్ BJP లీడర్ ఉమా భారతి శుక్రవారం సీఎం YOGI Adithyanath కు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు మీడియాను, రాజకీయ నాయకులను దళిత కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. యూపీ సీఎంకు అక్కలా చెబుతున్నా అంటూ తనకు తానే వరుస కలుపుకుని.. యూపీ సీఎంపై ఎటువంటి మచ్చ లేకుండా చేయాలని అన్నారు.

‘మీడియా వ్యక్తులను, ఇతర రాజకీయ నేతలను ఆ కుటుంబంతో కలిసేందుకు అనుమతించాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు కోరారు. ఇదంతా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అగ్రకులానికి చెందిన వ్యక్తుల చేతిలో 19 ఏళ్ల దళిత మహిళ.. రేప్ కు గురైంది. ఆ తర్వాత అర్ధరాత్రి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసేశారు.

ఈ ఘటనపై పలు రాష్ట్రాల నుంచి బీజేపీ దళిత వర్గానికి చెందిన ఎంపీలు.. పొలిటికల్ డ్యామేజీ జరగకూడదని జాగ్రత్తపడుతున్నారు. ఇది పూర్తిగా పోలీసుల్లో నిండి ఉన్న కుల వ్యవస్థ, అవినీతికు అనుకూలంగా ఉందని చెబుతున్నారు.

కొవిడ్-19 పాజిటివ్ AIIMSలో జాయిన్ అయిన భారతి.. తాను కోలుకున్న తర్వాత Hathras బాధిత కుటుంబాన్ని కచ్చితంగా కలుస్తానని మాటిచ్చారు. ‘యూపీ పోలీసుల అనుమానస్పద చర్యలు బీజేపీ, యూపీ ప్రభుత్వం, సీఎం యోగి ఆదిత్యనాథ్ పరువుపోయేలా చేస్తున్నాయని హిందీలో ట్వీట్ చేశారు.

జరిగిన దాంతో పాటు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి.. గ్రామంలోకి ఎవరినీ రానివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.

10TV Telugu News