Uttar Pradesh: స్కూల్లో ప్రేయర్ చేస్తుండగా గుండెపోటుతో టీచర్ మృతి

స్కూల్లో ఉదయం అందరితో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో స్టూడెంట్స్, స్టాఫ్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Uttar Pradesh: స్కూల్లో ప్రేయర్ చేస్తుండగా గుండెపోటుతో టీచర్ మృతి

Uttar Pradesh: స్కూల్లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం కొద్ది సేపట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం జరిగింది. బరేలి జిల్లా, సుభాష్ నగర్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో గోవింద్ అనే 23 ఏళ్ల వ్యక్తి ఉఫాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

Madhya Pradesh: ఆనందంగా డాన్స్ చేశారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు.. టెంపుల్‌లో డాన్స్ చేసినందుకు జాబ్ కోల్పోయిన మహిళలు

శనివారం ఉదయం పాఠశాలకు హాజరైన గోవింద్ విద్యార్థులతో ఉత్సాహంగా గడిపాడు. పిల్లలందరినీ ప్రేయర్ కోసం పిలిచాడు. తర్వాత ప్రేయర్ మొదలైంది. అయితే, అంతలోపే ఉన్నట్లుండి కార్డియాక్ అరెస్టుతో అదరిముందే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.

తమకు పాఠాలు చెప్పిన టీచర్ కళ్లముందే కుప్పకూలడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. గోవింద్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.