UP: మాస్క్ వేసుకోలేదని కాళ్లు, చేతులకు మేకులు కొడతారా.. అంటూ తల్లి ఆవేదన

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఫేస్ మాస్క్ వేసుకోలేదని లోకల్ పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లిపోయారంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.

UP: మాస్క్ వేసుకోలేదని కాళ్లు, చేతులకు మేకులు కొడతారా.. అంటూ తల్లి ఆవేదన

Mask Nails

UP: కరోనా విస్తరిస్తున్న సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశాయి ప్రభుత్వాలు. మాస్కు లేకుండా తిరిగే వారిని పలు రకాలుగా హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇక్కడ మరో వాదన వినిపిస్తుంది ఓ తల్లి నుంచి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఫేస్ మాస్క్ వేసుకోలేదని లోకల్ పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లిపోయారంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.

లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లేసరికి.. తన కొడుకును వేరే చోటుకు తీసుకెళ్లిపోయారట. గంటలకొద్దీ వెదికేసరికి ఆమె కొడుకు చేతులు, కాళ్లకు మేకులు కొట్టేశారు. ఈ ఘటన బరేలీలోని బరాదరి ఏరియాలో జరిగింది.

మే24న ఉదయం 10గంటల సమయంలో నా కొడుకు రోడ్ పై కూర్చొని ఉన్నాడు. సడన్ గా అక్కడికి పోలీసులు వచ్చారు. ప్రతి ఒక్కరినీ మాస్కుల గురించి అడిగారు. నా కొడుకుని పట్టుకుని తీసుకెళ్లారంటూ సూపరిండెంట్ కు రాసిన లెటర్ లో పేర్కొంది.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన సంగతి చెప్పిన ఆమెకు కొడుకును అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపు వచ్చిందట. బుధవారం తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది ఆ మహిళ.

కేసు గురించి మాట్లాడుతూ.. ‘ఆ వ్యక్తి పాత నేరస్థుడని అతనిపై పలు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని చెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటపడేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. అతని ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది’ అని పోలీసు అధికారులు అంటున్నారు.