అయోధ్యలో మసీదు కోసం 5 స్థలాలు గుర్తింపు!

  • Published By: sreehari ,Published On : December 31, 2019 / 09:50 AM IST
అయోధ్యలో మసీదు కోసం 5 స్థలాలు గుర్తింపు!

అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం 5 స్థలాలను గుర్తించింది. హిందువుల ఆరాధ్య దైవమైన రాముని జన్మస్థలంగా పిలుచుకునే అయోధ్యలో గతంలో బాబ్రా మసీదు నిర్మించారు. 1992లో బాబ్రీ మసీదును కార్ సేవక్స్ కూల్చేవేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఇప్పడు అదే ప్రదేశంలో రామ మందిరాన్ని తిరిగి నిర్మించేందుకు ఇటీవలే దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుప్రీం ఆదేశాల మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్థలాలను సేకరించే పనిలో పడింది. మిర్జాపూర్, షాంసద్దీన్ పూర్ సహా చాంద్ పూర్ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 5 ప్లాట్లను గుర్తించింది. ఈ స్థలాలన్నీ పవిత్ర స్థలంగా పేరుగాంచిన ‘పంచ్ కోసి పరిక్రమ’కు బయట వైపున 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సున్నీ వక్ఫ్ బోర్డు టెంపుల్ ట్రస్టు ఏర్పాటు కాగానే యూపీ ప్రభుత్వం.. ఈ ప్లాట్లను వారికి అప్పగించనుంది.

సుప్రీం ఆదేశాలతో దేవాలయ నిర్మాణం, ఇతర సమస్యలపై ఈ బోర్డు పర్యవేక్షించనుంది. అయోధ్యలోనే 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని గత నవంబర్ 9న సుప్రీం తీర్పు వెలువరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో 8 రివ్యూ పిటిషిన్లు దాఖలు కాగా, డిసెంబర్ 12న అన్ని రివ్యూ పిటిషన్లను టాప్ కోర్టు కొట్టివేసింది.