చిన్నారి పొట్ట చీల్చి దూరంగా పడేశారు

చిన్నారి పొట్ట చీల్చి దూరంగా పడేశారు

బీహార్‌లోని మంగర్ జిల్లాలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఏడాదిన్నర చిన్నారి పొట్ట చీల్చి పడేసిన ఘటన గ్రామాన్ని కంటతడి పెట్టించింది. చిన్నారికి ఇంటికి వంద మీటర్ల దూరంలో గుండె, కాలేయం, అవయవాలు కనిపించే విధంగా శరీరం ఊడిపోయి ఉండటంతో స్థానికులు షాక్ అయ్యారు. 

తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సొండిలా తాంతి తొలా ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణ తాంతి.. రేఖా దేవీల ఒక్కగానొక్క కొడుకు ఆశిష్ కుమార్. రోజువారీ కూలీగా పనిచేస్తూ బతుకుతున్నాడు. ప్రతి రోజులాగే భర్త కూలీ పనులకు వెళ్లడంతో రేఖా తన కొడుకును బయట విడిచిపెట్టి ఇంటి పని చేసుకుంటుంది. అదే సమయంలో ఒక్కసారిగా కేకలు వినపడ్డాయి.

వంద మీటర్ల దూరంలో జరిగిన ఘటన చూసి పరిగెత్తుకుంటూ వెళ్లింది. రక్తపు మడుగులో కొడుకు పొట్ట దగ్గర శరీరం చీలి పడి ఉన్నాడు. స్థానికులు చికిత్స్ కోసం దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు కుట్లు వేసి భగల్‌పూర్‌ హాస్పిటల్‌కు పంపించారు. వైద్యులు చిన్నారి పొట్టను పదునైన కత్తితో కోసినట్లు వివరించారు. 

తన కుటుంబానికి ఎవ్వరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదని ఆ చిన్నారి తల్లి చెబుతుండగా, ఇది చిన్నారులను దొంగిలించే ముఠాలాంటి వారెవరైనా చేసి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పారిపోయారనే కోణంలో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.