PM Modi gets emotional : వీడియో కాన్ఫరెన్స్ లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ

కరోనా కట్టడిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో శుక్రవారం ప్ర‌ధాని మోడీ.. త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గమైన వార‌ణాసికి చెందిన డాక్ట‌ర్లు, పారా మెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల‌తో

PM Modi gets emotional : వీడియో కాన్ఫరెన్స్ లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ

Virus Snatched Many Loved Ones Pm Modi Gets Emotional Thanks Healthcare Professionals

PM Modi gets emotional కరోనా కట్టడిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో శుక్రవారం ప్ర‌ధాని మోడీ.. త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గమైన వార‌ణాసికి చెందిన డాక్ట‌ర్లు, పారా మెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. క‌రోనా క‌ట్ట‌డిలో వార‌ణాసి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవ‌ల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు. త‌క్కువ స‌మ‌యంలోనే న‌గ‌రంలో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు, ఐసీయూ ప‌డ‌క‌ల‌ను పెద్ద సంఖ్య‌లో విస్త‌రించార‌ని కొనియాడారు.

కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో డాక్టర్లు,ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారని.. ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారని ప్రధాని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఉన్నట్టుండి భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారికి మనవాళ్లు ఎంతో మంది బలయ్యారని ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కరోనా బలి తీసుకుంటుదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

ఇక,కొవిడ్-19పై మ‌నం పోరాడుతుండ‌గానే బ్లాక్ ఫంగ‌స్ రూపంలో మరో సవాల్ ఎదురైంద‌ని దీన్ని స‌మ‌ర్ధంగా ఎదుర్కొనేందుకు మ‌నం జాగ్ర‌త్త‌లు పాటిస్తూ సంసిద్ధం కావాల‌ని ప్రధాని అన్నారు. ఎక్కడ మహమ్మారి ప్రబలిందో.. అక్కడ చికిత్స అందాల్సిందే అన్నది మన కొత్త నినాదమని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్‌ తీసుకున్నారని గురువారం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.