Viral Video: వాలెంటైన్స్ డే సందర్భంగా కూతురికి తండ్రి సర్ ప్రైజ్

వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ తండ్రి తన కూతురికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. సాధారణంగా వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుడు తాను ప్రేమించిన అమ్మాయిని డేట్ కి తీసుకెళ్తాడు. ఆమెకు గిఫ్టులు కొనిపెట్టి, ఆమెను రోజంతా సంతోషంగా ఉంచుతాడు. అయితే, ఓ తండ్రి మాత్రం ప్రత్యేకంగా ఆలోచించాడు. తన చిట్టితల్లికి గిఫ్టులు కొనివ్వాలని, ఆమెను నగరం మొత్తం తిప్పాలని భావించాడు.

Viral Video: వాలెంటైన్స్ డే సందర్భంగా కూతురికి తండ్రి సర్ ప్రైజ్

Viral Video

Viral Video: వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ తండ్రి తన కూతురికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. సాధారణంగా వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుడు తాను ప్రేమించిన అమ్మాయిని డేట్ కి తీసుకెళ్తాడు. ఆమెకు గిఫ్టులు కొనిపెట్టి, ఆమెను రోజంతా సంతోషంగా ఉంచుతాడు. అయితే, ఓ తండ్రి మాత్రం ప్రత్యేకంగా ఆలోచించాడు. తన చిట్టితల్లికి గిఫ్టులు కొనివ్వాలని, ఆమెను నగరం మొత్తం తిప్పాలని భావించాడు.

ఆ పని చేసి, ఆ సమయంలో తీసుకున్న వీడియోను పోస్ట్ చేశాడు. నా వాలైంటైన్ గా నువ్వు ఉంటావా? అంటూ తన చిన్నారి కూతురును తండ్రి అడుగుతాడు. అనంతరం ఆమెను షాపింగ్ కు తీసుకెళ్లడం, ఆమెను నచ్చినవి కొనివ్వడం వంటివి చేసి సర్ ప్రైజ్ ఇస్తాడు. వారిద్దరు హోటల్ లో భోజనం కూడా చేయడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. కూతురిని తండ్రి ఫస్ట్ వాలెంటైన్ డేట్ కి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపర్చాడని నెటిజన్లు కామెంట్లు చేశారు. భవిష్యత్తులో తనకు కూతురు పుడితే తాను కూడా ఇలాగే చేస్తానంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

Bandi Sanjay : కాంగ్రెస్ పై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదు : బండి సంజయ్