PM Modi: భారత్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టే “ఆపరేషన్ గంగా” సాధ్యమైంది: మోదీ

ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: భారత్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టే “ఆపరేషన్ గంగా” సాధ్యమైంది: మోదీ

Modhi

PM Modi: ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యుక్రెయిన్ సరిహద్దుల్లోని ఆయా దేశాలతో ఉన్న సఖ్యత కారణంగానే ఆపరేషన్ గంగా సాధ్యమైందని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించడంలో.. భారతదేశానికి ప్రపంచంలో పెరుగుతున్న బలం కారణమని అన్నారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న చివరి భారతీయుడిని తిరిగి స్వదేశానికి తరలించేంత వరకు ఆపరేషన్ గంగా కొనసాగుతుందని ప్రధాని అన్నారు.

Also read: Assembly Elections: ముగింపు దశకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2023లో తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

ఇప్పటికే వేలాది మందిని సురక్షితంగా భారత్ కు తిరిగి తీసుకొచ్చామని.. మిగిలిన వారిని సైతం క్షేమంగా తరలించేలా నలుగురు కేంద్ర మంత్రులను యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపినట్లు మోదీ వివరించారు. సాధ్యమైతే ఇతర దేశాల పౌరులను సైతం వారి వారి దేశాలకు తరలిస్తామని మోదీ తెలిపారు. ఇక ఎన్నికల సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా అంకురార్పణను’, “సాయుధ బలగాల పరాక్రమాన్ని” ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఇక దేశాన్ని ఏమాత్రం శక్తివంతంగా తీర్చిదిద్దుతామని మోదీ ధ్వజమెత్తారు.

Also read: Atchennaidu : ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు.. 160 స్థానాల్లో టీడీపీ విజయం-అచ్చెన్నాయుడు