Lok Sabha: మనం మన జవాన్లను కించపర్చకూడదు: రాహుల్ గాంధీకి లోక్‌సభలో జైశంకర్ కౌంటర్

‘‘రాజకీయ విమర్శలు ఎదుర్కోవడంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ, మనం మన జవాన్లను కించపర్చకూడదు. నేను చైనా అంశం గురించి లోతుగా అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు. ఇటువంటి సూచనలను నేను గౌరవిస్తాను. మన జవాన్ల గురించి మాత్రం వారు తప్పుగా మాట్లాడకూడదు’’ అని జైశంకర్ అన్నారు.

Lok Sabha: మనం మన జవాన్లను కించపర్చకూడదు: రాహుల్ గాంధీకి లోక్‌సభలో జైశంకర్ కౌంటర్

Lok Sabha

Lok Sabha: సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలపై కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై లోక్‌సభలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ మాట్లాడారు. ‘‘మన జవాన్లను నేరుగా, పరోక్షంగానూ విమర్శించకూడదు. యాంగ్త్సేలో మన జవాన్లు 13,000 అడుగు ఎత్తులో నిలబడి మన సరిహద్దులను రక్షిస్తున్నారు. వారిని మనం గౌరవించాలి.. అభినందించాలి. చైనా చర్యలపై మేము దృష్టి పెట్టలేదని అనడం సరికాదు. అదే నిజమైతే, మరి సరిహద్దుల వద్దకు భారత ఆర్మీని ఎవరు పంపారు? సైనికుల ఉపసంహరణపై చైనాపై మేము ఒత్తిడి చేస్తున్నాం కదా? చైనాతో సత్సంబంధాలు సాధారణరీతిలో లేవని చెబుతున్నాం కదా?’’ అని చెప్పారు.

‘‘రాజకీయ విమర్శలు ఎదుర్కోవడంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ, మనం మన జవాన్లను కించపర్చకూడదు. నేను చైనా అంశం గురించి లోతుగా అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు. ఇటువంటి సూచనలను నేను గౌరవిస్తాను. మన జవాన్ల గురించి మాత్రం వారు తప్పుగా మాట్లాడకూడదు’’ అని జైశంకర్ అన్నారు.

భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చంటూ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. విదేశాంగ మంత్రి ప్రకటనలు చేస్తున్నారని, అయితే, భారత్-చైనా సరిహద్దుల అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని అన్నారు.

అలాగే, శ్రీలంక విషయంపై జైశంకర్ మాట్లాడుతూ… ‘‘2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,835 మంది భారత మత్స్యకారులు శ్రీలంక నుంచి విడుదల అయ్యారు. తమిళ మత్స్యకారుల సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. పలు సందర్భాల్లో శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు’’ అని చెప్పారు.

Millet Only Lunch: పార్లమెంట్‪లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. హాజరుకానున్న మోదీ