మారటోరియం రిలీఫ్ : కేంద్రం ప్రకటించిన చక్రవడ్డీ మాఫీకి అర్హులెవరు? ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి?

  • Published By: sreehari ,Published On : October 28, 2020 / 07:39 PM IST
మారటోరియం రిలీఫ్ : కేంద్రం ప్రకటించిన చక్రవడ్డీ మాఫీకి అర్హులెవరు? ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి?

compound interest waiver  : రుణదారులకు గత వారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది.

రుణగ్రహితల్లో మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించింది.

2020 మార్చి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కాలానికి చక్రవడ్డీ మాపీని వర్తింపచేసింది.



ఈ స్కీమ్ వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా NPAగా ఉండరాదని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇదివరకే మారటోరియం చక్రవడ్డీ మాఫీకి సంబంధించి అఫిడవిట్ ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.

ఇంతకీ మారటోరియం కాలానికి రుణదారుల్లో చక్రవడ్డీ మాఫీకి ఎవరూ అర్హులు? ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఓసారి చూద్దాం..



* కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్ఎంఈ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయి.

* లోన్ మొత్తం రూ. 2 కోట్లు కంటే దాటకూడదు.
* ఫిబ్రవరి 29, 2020 నాటికి లోన్ అకౌంట్ స్టాండర్డ్ అకౌంట్ అయి ఉండాలి.

* రుణం ఇచ్చిన సంస్థ బ్యాంకింగ్ కంపెనీ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకు, కో-ఆపరేటివ్ బ్యాంకు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్సిస్ట్యూషన్ , నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయి ఉండాలి.

* రుణగ్రహీత పూర్తిగా పొందాడా, పాక్షికంగా పొందాడా లేదా మారటోరియాన్ని పొందలేదా? అనేది సంబంధం లేకుండా రుణగ్రహీత లోన్ అకౌంట్‌కు చెల్లించాలి.

* మీరు మారటోరియాన్ని ఎంచుకోకపోయినా, ఈ పథకం కింద అర్హులే.

* ఈ పథకం కింద.. చక్ర వడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఉంటుంది.

మార్చి 1, 2020 ఆగస్టు 31, 2020 (6 నెలలు / 184 రోజులు) మధ్య కాలానికి రుణగ్రహీత లోన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.

* వడ్డీ రేటు ఫిబ్రవరి 29, 2020 నాటికి గణన జరిగి ఉండాలి.

*  2020 నవంబర్ 5లోగా రుణదారు సంస్థ ఏదైనా రుణగ్రహీత ఖాతాకు నగదును క్రెడిట్ చేయవలసి ఉంటుంది.



చక్రవడ్డీ మాఫీ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? :
ఒకవేళ మీరు ఆరు నెలల కాలానికి మారటోరియం ఎంచుకుంటే.. మీ నెలవారీ ఈఎంఐ వడ్డీ ఔట్ స్టాడింగ్ ప్రిన్సిపల్ కంపోనెంట్ మొత్తానికి యాడ్ అవుతుంది.

కొత్త ఈఎంఐ మాత్రం మిగిలిన లోన్ కాల పరిమితి ఆధారంగా లెక్కించడం జరుగుతుంది.

సాధారణంగా వడ్డీ అనేది కంపౌడింగ్ ఫార్మూలాతో లెక్కిస్తారు. మీరు సంపాదించిన మొత్తం వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.



ఈ స్కీమ్ కింద రుణగ్రహిత ఎవరైనా.. చక్రవడ్డీకి బదులుగా సాధారణ వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

అది కూడా మారటోరియం కాలంలో మిగిలిన లోన్ మొత్తంపై చెల్లించాల్సి ఉంటుంది.

తద్వారా రుణగ్రహితపై తక్కువ వడ్డీ భారం పడుతుంది.

లోన్లు తిరిగి చెల్లించడం ప్రారంభించిన వారి కంటే పెద్ద మొత్తంలో పాత లోన్లు కలిగిన రుణగ్రహితలకు తక్కువ ప్రయోజనాలు ఉంటాయి.



దీనికి కారణం.. సాధారణంగా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభిస్తే.. EMIలో వడ్డీ భాగం నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది.

ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువగా ఉంటుంది. లోన్ కాల పరిమితి కూడా ముగింపుకు దగ్గరగా ఉంటుంది.

వడ్డీ భాగం తక్కువగా ఉండి… ప్రిన్సిపల్ కంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. వడ్డీ భాగం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో చక్ర వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది.

EMIలలో అధిక వడ్డీ పోర్షన్లు ఉన్నవారు మాఫీ ద్వారా ఎక్కువ లాభం పొందుతారన్నారు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శాలిని గుప్తా.