పౌరసత్వ సవరణ: పోలీసులతో కలిసి విద్యార్థులపై లాఠీ చార్జీ చేసిన ముసుగుమనిషి?

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 03:48 AM IST
పౌరసత్వ సవరణ: పోలీసులతో కలిసి విద్యార్థులపై లాఠీ చార్జీ చేసిన ముసుగుమనిషి?

పౌరసత్వ సవరణ బిల్లుపై ఇంకా ప్రకంపనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఒక ఫొటో, వీడియో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. ఓ విద్యార్థిని పోలీసులు చితకబాదుతుంటే..విద్యార్థినులు చుట్టూ రక్షణగా నిలిచారు. అయినా…పోలీసులు కనికరించలేదు.

అయితే..అందరూ డ్రస్‌లో ఉంటే..ఓ వ్యక్తి మాత్రం ఎర్రటి చొక్కా ధరించి..జీన్ ప్యాంట్ ధరించి..లాఠీ ఎత్తిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అందరూ డ్రస్‌లో ఉంటే..ఇతను ఎవరు అనే దానిప తెగ చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పోస్టు చేస్తున్నారు. దీనిపై మార్కేంటేడయ కట్జూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. విద్యార్థులను చితకబాదుతున్న సివిల్ డ్రస్‌లో ఉన్న వ్యక్తి ఎవరో తనకు చెప్పాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటూ..మరికొంతమంది వెల్లడిస్తున్నారు. ఓ విద్యార్థి తోటి విద్యార్థులను చితకబాదిన దృశ్యాలను మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఢిల్లీ పోలీసులతో కలిసి లాఠీఛార్జీ చేసిన వ్యక్తి ఒకరే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ రెస్పాండ్ అయ్యింది. ఎర్ర చొక్కా..బ్లూ కలర్ జీన్స్ వేసుకున్న వ్యక్తి AATS లో పోలీసు కానిస్టేబుల్ అని, సుమారు 30 ఏళ్లపైన వయస్సు ఉంటుందని వెల్లడించారు. అయితే..భద్రతా కారణాల దృష్ట్యా పేరును వెల్లడించలేమని, ప్రచారం జరుగుతున్నట్లు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనేది ఫేక్ అని తెలిపారు. 

Read More : వీడియో చిక్కులు : జైలులో నిద్ర పట్టలేదు – పాయల్ రోహత్గి

డిసెంబర్ 14వ తేదీ శనివారం వర్సిటీ రణరంగంగా మారిపోయింది. 
వర్సిటీ విద్యార్థులను పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 
విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు, పోలీసులకు గాయాలయ్యాయి. 

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ  నాగాలండ్‌, మేఘాలయలతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. 
పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ నెల 21వ తేదీన బీహార్‌ బంద్‌ పాటించాలని ఆర్‌జేడీ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.
అస్సాంలో నిరసనలు కొనసాగాయి. అయితే..తర్వాత ఆందోళనలు సద్దుమణిగాయి. అస్సాంలో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు.