National family health survey: ఆ విషయంలో పురుషుల్ని మించిపోతున్నారు.. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళలే టాప్

చదువు విస్తృతమైనాకొద్ది, సాంకేతికత పెరిగినాకొద్ది ఇలాంటి విషయాల్లో మార్పులు వస్తున్నాయి. సంప్రదాయాలు నిక్కచ్చిగా ఉండే మన దేశంలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తుండడం విశేషం. అవును.. భారతీయ స్త్రీలు తమపై మోపిన హద్దుల్ని చెరిపేస్తున్నారు. లైంగిక స్వేచ్ఛను అనుభవించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పిన లెక్కలే ఇందుకు మంచి ఉదాహరణ.

National family health survey: ఆ విషయంలో పురుషుల్ని మించిపోతున్నారు.. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళలే టాప్

Women tend to have more sexual partners than men says survey

National family health survey: ‘‘అనగనగా రాజుకు ఏడుగురు భార్యలు’’.. చరిత్ర చదవాల్సి వచ్చినప్పుడు ఎక్కువసార్లు పునరావృతమయ్యే మాట ఇది. అదేంటో రాజు గారికి ఒకరికి మించి ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లు చదువుతాం కానీ, రాణిగారి విషయంలో అలా ఎక్కడా కనిపించదు. లైంగిక సంబంధాల విషయంలో ఆనాదిగా మహిళలై ఉండే ఆంక్షలు, కట్టుబాట్లు అలాంటివి. ఒక్క మన దేశమే కాదు.. ఈ విషయంలో ప్రాంతం, మతం, భాషతో సంబంధం లేకుండా ఆచారవ్యవహరాలు, సంప్రదాయాల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై ఉండే ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే చదువు విస్తృతమైనాకొద్ది, సాంకేతికత పెరిగినాకొద్ది ఇలాంటి విషయాల్లో మార్పులు వస్తున్నాయి. సంప్రదాయాలు నిక్కచ్చిగా ఉండే మన దేశంలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తుండడం విశేషం. అవును.. భారతీయ స్త్రీలు తమపై మోపిన హద్దుల్ని చెరిపేస్తున్నారు. లైంగిక స్వేచ్ఛను అనుభవించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పిన లెక్కలే ఇందుకు మంచి ఉదాహరణ.

దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకే సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల్లో తేలింది. చండీగఢ్, జమ్ముకశ్మీర్, లఢఖ్, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చెరీలోని మహిళలు ఈ విషయంలో పురుషులకంటే ముందున్నారు. ఇక రాజస్థాన్‌లో అత్యధికంగా ప్రతి మహిళకు సగటున 3.1 మంది లైంగిక భాగస్వాములుండగా, పురుషుల విషయంలో ఈ సంఖ్య 1.8గా ఉంది.

అయితే జీవిత భాగస్వామి లేదా సహజీవనం చేస్తున్న వ్యక్తితో కాక ఇతరులతో సెక్స్‌లో పాల్గొన్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఇలాంటి సంబంధాలున్న పురుషుల వాటా 4 శాతం కాగా మహిళల వాటా మాత్రం 0.5 శాతం. మొత్తం 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేకు మునుపు సంవత్సర కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో 2019-21 మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేరిట ఈ సర్వే నిర్వహించారు. ప్రజల అభ్యున్నతి కోసం పథకాల రూపకల్పనలో సర్వే సమాచారాన్ని ప్రభుత్వం వినియోగిస్తుందని సమాచారం.

Mumbai: 11 ఏళ్ల స్నేహితురాలిపై ముగ్గురితో అత్యాచారం చేయించడమే కాకుండా, అక్కడే ఉండి చూస్తూ పైశాచిక ఆనందం