కరోనా వైరస్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన వూహాన్ శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన వూహాన్ శాస్త్రవేత్తలు

Wuhan scientists ఏడాదిగా ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్‌లోనే పుట్టింద‌ని చాలా మంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అగ్ర‌రాజ్యం సైతం ఇవే వాద‌న‌లు వినిపించింది. అయితే, డ్రాగన్ దేశం మాత్రం అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లంటూ కొట్టిపారేస్తూ వ‌చ్చింది. అయితే ఆ అనుమానాలు, ఆరోప‌ణ‌లే నిజ‌మ‌ని తాజాగా తేలింది.

వుహాన్ ల్యాబ్‌ లో పనిచేస్తున్న సైంటిస్టులు కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. 2017లో ఓ గుహ‌లో ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో త‌మ‌ను.. క‌రోనా వైర‌స్ సోకిన గ‌బ్బిలాలు కుట్టాయ‌ని వాళ్లు చెప్పారు. ఈ సంచ‌ల‌న విష‌యాన్ని తైవాన్ టైమ్స్ వెల్ల‌డించింది. తాము పరిశోధనల కోసం గుహ లోనికి వెళ్లినప్పుడు ఓ గ‌బ్బిలం తాను చేతికి వేసుకున్న ర‌బ్బ‌ర్ గ్లోవ్స్ లోపలికి వెళ్లి కుట్టిన‌ట్లు బృదంలోని ఓ సైంటిస్ట్ చెప్పారు. ఆ సమయంలో తాము ఆ గుహ‌లో కొన్ని శాంపిల్స్ సేక‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి వుహాన్ మరియు తరువాత ప్రపంచాన్ని తాకడానికి ముందు రెండు సంవత్సరాల క్రితం వెలువడిన ఒక వీడియోలో..వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) శాస్త్రవేత్తలు చేతుల‌కు గ్లవ్స్, మాస్క్‌లు లేకుండా ‘లైవ్ వైరస్’లపై పనిచేస్తున్నట్లు చూపిస్తుంది. ఇవ‌న్నీ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మే. ఒక శాస్త్రవేత్త వీడియోలో తన చేతులతో గబ్బలిలాన్ని పట్టుకోవడం కూడా వీడియోలో చూడవచ్చు.