Parliament updates: మీరు రాహుల్ గాంధీని “పప్పు” చేయాలనుకున్నారు.. ఆయనే మిమ్మల్ని “పప్పు”ను చేశారు: అధీర్ రంజన్

"రాహుల్ గాంధీని పప్పుగా చిత్రీకరించాలని మీరు ప్రయత్నాలు జరిపారు. అయితే, రాహుల్ గాంధీనే మిమ్మల్ని పప్పును చేశారు. ఇంతకు ముందు రాష్ట్రపతి కులం, మతం గురించి మనం ఎటువంటి వ్యాఖ్యలూ వినేవాళ్లం కాదు. మొట్టమొదటిసారి దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఓ ఆదివాసీని బీజేపీ రాష్ట్రపతిని చేసిందని చెప్పుకునేలా చేస్తున్నారు. దీన్ని ఓ రాజకీయ అంశంగా మార్చారు" అని అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

Parliament updates: మీరు రాహుల్ గాంధీని “పప్పు” చేయాలనుకున్నారు.. ఆయనే మిమ్మల్ని “పప్పు”ను చేశారు: అధీర్ రంజన్

Parliament updates

Parliament updates: కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ అధీర్ రంజన్ చౌదరి మాట్లాడారు.

“రాహుల్ గాంధీని పప్పుగా చిత్రీకరించాలని మీరు ప్రయత్నాలు జరిపారు. అయితే, రాహుల్ గాంధీనే మిమ్మల్ని పప్పును చేశారు. ఇంతకు ముందు రాష్ట్రపతి కులం, మతం గురించి మనం ఎటువంటి వ్యాఖ్యలూ వినేవాళ్లం కాదు. మొట్టమొదటిసారి దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఓ ఆదివాసీని బీజేపీ రాష్ట్రపతిని చేసిందని చెప్పుకునేలా చేస్తున్నారు. దీన్ని ఓ రాజకీయ అంశంగా మార్చారు” అని అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

“కొన్ని రోజుల క్రితం డిల్లీలో డీజీలు, ఐజీల సమావేశం జరిగింది. అందులో పోలీసు అధికారులు పరిశోధక పత్రాలను చూపారు. తూర్పు లద్ధాఖ్ లో ఇంతకు ముందు 65 గస్తీ పాయింట్లు ఉండేవని, ఇప్పుడు 25 పాయింట్ల వద్ద గస్తీ కొనసాగించే వీలు లేకుండాపోయిందని చెప్పారు.

నవీన భారతానికి జవహర్ లాల్ నెహ్రూ పునాది రాయి వేశారు. దేశంలో 14 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అయితే, మీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎంపీ, రాష్ట్ర సీఎం కూడా లేరు. పరిస్థితి ఇలా ఉంటే మీరు మాత్రం ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు అంటూ నినాదం ఇస్తున్నారు” అని అధీర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు.

Mahua Moitra: మహిళా ఎంపీ అభ్యంతకర వ్యాఖ్యలు.. పార్లమెంట్ లో వాడకూడని పదాలు ఇవే..