Pani Puri : మరీ ఇంత పొగరా? పానీపూరిలో ఉల్లిపాయలు లేవన్నాడని..

పానీపూరి తినేటప్పుడు ఉల్లిపాయలు లేవన్నాడని ఆ యువతి కోపంతో ఊగిపోయింది. పానీపూరి అమ్మే వ్యక్తితో గొడవకు దిగింది. అతడు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు.

Pani Puri : మరీ ఇంత పొగరా? పానీపూరిలో ఉల్లిపాయలు లేవన్నాడని..

Pani Puri

Pani Puri : చిన్న చిన్న విషయాలకే కొందరు సహనం కోల్పోతున్నారు. కోపంతో ఊగిపోతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. ఈ విషయంలో మగవాళ్లే కాదు కొందరు ఆడవాళ్లు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు. నానా రభస చేయడమే కాదు మ్యాన్ హ్యాండ్లింగ్ కు దిగుతున్నారు. కొన్ని రోజుల క్రితం అతడి తప్పేమీ లేకపోయినా ఓ క్యాబ్ డ్రైవర్ ను ఓ లేడీ నడిరోడ్డుపై కొట్టి నానా రచ్చ చేసిన సంఘటన గుర్తుంది కదా? అలాంటిదే మరో ఘటన జరిగింది. పానీపూరిలో ఉల్లిపాయలు లేవన్నాడని ఓ యువతి వీరంగం చేసింది.

Read More Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

పానీపూరి తినేటప్పుడు ఉల్లిపాయలు లేవన్నాడని ఆ యువతి కోపంతో ఊగిపోయింది. పానీపూరి అమ్మే వ్యక్తితో గొడవకు దిగింది. అతడు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. ఉల్లిపాయలు అయిపోయాయి, ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లి తేవాలి? అని చెప్పాడు. అయితే, అలా ఎలా అంటావని ఆమె వాదనకు దిగింది. ఉల్లి ముక్కలు లేకపోతే.. ఇచ్చే ముందు చెప్పాలి కదా అంటూ చిర్రెత్తిపోయింది. ఉల్లిపాయలు లేనప్పుడు పానీపూరి ఎందుకు అమ్ముతున్నావు అంటూ అతడిపై సీరియస్ అయ్యింది. ఉల్లిపాయలు అయిపోయాయని ఆ చిరు వ్యాపారి నచ్చ చెబుతుండగానే.. కోపంతో ఒక్కసారిగా అతడి సైకిల్ ను కాలితో తన్నింది. అంతే దెబ్బకు సైకిల్ కిందకి పడిపోయింది.

Read More..Aadhaar-BHIM : గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు!

దీంతో సైకిల్ పై ఉన్న ఆహార పదార్దాలు మొత్తం నేలపాలు అయ్యాయి. చిరు వ్యాపారి, అతడే జీవనాధారం అని కూడా చూడకుండా ఆ యువతి ఇలా దారుణంగా వ్యవహరించింది. పక్కనే ఉన్న వారు ఇదేంటని ఆమెని ప్రశ్నించారు. ఉల్లిపాయ ముక్కలు కోసం ఇంత పని చేస్తావా అంటూ మండిపడ్డారు. దీంతో ఆ యువతి వారిపైనా ఫైర్ అయ్యింది. మీకు అనవసరం, చెంప పగులుద్ది అని వార్నింగ్ ఇచ్చింది. బూతులు తిట్టడం ప్రారంభించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ యువతిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత చిన్న విషయానికి అంత పని చేయాలా? మరీ ఇంత పొగరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.