ఫస్ట్ చాన్స్‌లోనే కేబినెట్‌లోకి.. కొత్త మంత్రులు వీరే, రేపే కేబినెట్ విస్తరణ

  • Published By: naveen ,Published On : July 21, 2020 / 10:38 AM IST
ఫస్ట్ చాన్స్‌లోనే కేబినెట్‌లోకి.. కొత్త మంత్రులు వీరే, రేపే కేబినెట్ విస్తరణ

ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? కొత్త మంత్రులు ఎవరు? కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. బుధవారం, జూలై 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 29 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించింది. ఆ రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఏపీ కొత్త మంత్రులు వీళ్లే | YCP MLA ...

అదే సామాజికవర్గానికి చెందిన వారికి పదవులు:
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి స్థానాల్లో కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే వారి పేర్లు కూడా ఖరారయ్యాయి. మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ(శెట్టి బలిజ), శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు(మత్స్యకార కుటుంబం) కేబినెట్‌లో చోటు ఖాయం అని తెలుస్తోంది. బుధవారం ప్రభుత్వం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది.

మండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించడం, దీనిపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడంతో వీరు మంత్రి పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో ఇటీవలే వీరిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

తొలిసారి గెలుపుతోనే కేబినెట్ లోకి:
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి.. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. కాబట్టి ఆ రెండు మంత్రి పదవులను మళ్లీ ఆ సామాజికవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. కాగా, ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారే. ఫస్ట్ టైమ్ గెలుపుతోనే కేబినెట్ లో చోటు సంపాదించుకోవడం విశేషం. ఆ ఇద్దరూ చాలా లక్కీ అని అంటున్నారు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంతోమంది సీనియర్లు మంత్రి పదవి కోసం తీవ్రంగా వేచి చూస్తున్నారు. ఒక్క చాన్స్ అని సీఎం జగన్ ను వేడుకుంటున్నారు. అలాంటిది, ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే గెలుపుతోనే మంత్రి పదవులు దక్కడం నిజంగా అదృష్టమే అంటున్నారు.

Political Roundup

రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ బ్యాక్ గ్రౌండ్:
* సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రాజోలు
* జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన అనుభవం
* గతంలో కాకినాడ రూరల్ ఇంచార్జి
* 2019లో తొలిసారి రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు

Member's Information

మంత్రి కాబోతున్న డాక్టర్:
* సొంతూరు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునాల్తాడ
* మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ అప్పలరాజు
* కాకినాడ రంగరాయ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి
* విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ లో పీజీ
* రెండున్నరేళ్ల కిందటి వరకు డాక్టర్ గా అందరికీ సుపరిచితం
* తొలిసారి గెలుపుతోనే మంత్రి పదవి
* 7వ తరగతిలో జిల్లాలో సెకండ్ ర్యాండ్
* 10thలో స్టేట్ 4th ర్యాంక్
* MBBSలో గోల్డ్ మెడల్