Karnataka Polls: కర్ణాటకను కుదిపివేస్తున్న ముస్లిం రిజర్వేషన్లు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హాట్ కామెంట్స్

కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు శాతంలో రెండు శాతం రిజర్వేషన్లను వీరశైవ-లింగాయత్‌లకు, మరో రెండు శాతం రిజర్వేషన్లను వొక్కళిగ సామాజిక వర్గానికి పంపిణీ చేసింది. ఓబీసీ ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్ల కేటగిరీలోకి పంపించింది.

Karnataka Polls: కర్ణాటకను కుదిపివేస్తున్న ముస్లిం రిజర్వేషన్లు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హాట్ కామెంట్స్

BJP, Congress war of words over muslim reservation ahead of Karnataka Polls

Karnataka Polls: కర్ణాటక రాష్ట్రంలో ఓబీసీ కోటా కింద ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను బొమ్మై ప్రభుత్వం తాజాగా తొలగించింది. మరో నెల రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విషయం రాష్ట్రంలో చాలా హట్ హట్ గా మారింది. మెజారిటీ ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ ఇలాంటి జిమ్మిక్కులు వేస్తోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి బుజ్జగింపు రాజకీయాలు బాగా అలవాటని అందుకే రాజ్యాంగంలోని లేని మతం ఆధారంగా రిజర్వేషన్లను తీసుకువచ్చిందని అధికార బీజేపీ ప్రతిదాడి చేస్తోంది.

CM KCR : అప్పటివరకూ.. మహారాష్ట్రకు వస్తూనే ఉంటా-నాందేడ్ సభలో కేసీఆర్

కాగా, కర్ణాటక పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆదివారం నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం కల్పిస్తున్నవి కాదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్‌లకు ఇచ్చింది. ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ చేసిన రాజకీయం’’ అని అన్నారు.

Shatrughan Sinha: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు మోదీకి థాంక్స్ చెప్పిన టీఎంసీ ఎంపీ శత్రుఘన్ సిన్హా

అయితే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఈ రిజర్వేషన్లను తాము అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని కర్ణాటక కాంగ్రెస్ అధినేత డీకే శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను తొలగించి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీలోకి పంపించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆస్తిని పంచినట్లుగా రిజర్వేషన్లను పంచవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని విమర్శించిన ఆయన రిజర్వేషన్లు అనేవి ఓ ఆస్తి, సంపద కాదన్నారు. రిజర్వేషన్లను పొందడం మైనారిటీల హక్కు అని చెప్పారు. ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దవ్వాలని, వాటిని ప్రధాన సామాజిక వర్గాలకు పంపిణీ చేయాలని తాము కోరుకోవడం లేదని డీకే విమర్శించారు.

Amritpal Singh: పోలీసులు తీవ్ర వేట నేపథ్యంలో అమృతపాల్ సింగ్‭కు సిక్కు సంఘం పిలుపు