Congress: ఎంత ధైర్యం? రాహుల్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను సాధ్వీపై మండిపడ్డ కాంగ్రెస్

రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌‭లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేకసార్లు ఇలా జరిగిందన్నారు

Congress: ఎంత ధైర్యం? రాహుల్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను సాధ్వీపై మండిపడ్డ కాంగ్రెస్

Congress fires salvo at Sadhvi Pragya over her remarks on Rahul Gandhi

Congress: భోపాల్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్‭పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మహాత్మగాంధీని చంపిన టెర్రరిస్ట్ నాథూరాం గాడ్సేని తన గురువని చెప్పుకున్న ఆమెకు రాహుల్ గాంధీపై నోరెత్తడానికి ఎంత ధైర్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ మీద ప్రగ్యా ఠాకూర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత దేశం గురించి విదేశీ గడ్డపై సిగ్గు చేటు అయిన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను దేశం నుంచి వెళ్ళగొట్టాలన్నారు. విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పాడని, అది నిజమేనని రాహుల్ గాంధీ రుజువు చేస్తున్నారని అన్నారు.

MLC polls in Andhra, Telangana-2023 LiveUpdates: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ షురూ..

రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌‭లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేకసార్లు ఇలా జరిగిందన్నారు. భారతీయ ప్రజాస్వామిక నిర్మాణంపై కిరాతక దాడి జరుగుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పరస్పరం విమర్శించుకున్నాయి.

ADR Report: 7 పార్టీలకు అందిన 66 శాతం విరాళాలు గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చాయట