Luizinho Faleiro: దీదీకి షాకిచ్చిన గోవా మాజీ సీఎం.. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్‌పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పార్టీకే చెందిన అర్పిత ఘోష్ చేత రాజ్యసభ సభ్యత్వానికి అప్పట్లో రాజీనామా చేయించారు

Luizinho Faleiro: దీదీకి షాకిచ్చిన గోవా మాజీ సీఎం.. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

Luizinho Faleiro and mamata benerjee

Luizinho Faleiro: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ సుప్రెమో మమతా బెనర్జీ(Mamata Banerjee)కి గోవా మాజీ ముఖ్యమంత్రి లుయిజిన్హో ఫెలీరో (Luizinho Faleiro) షాకిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. అంతే కాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీలో చేరిన ఆయన.. ప్రస్తుత రాజీనామా అనంతరం ఏ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగాణాలు వస్తుంటాయి. అయితే ఈ విషయమై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని మీడియా ముందు స్పష్టం చేశారు.

Rahul Gandhi: వయనాడ్‭లో భారీ ర్యాలీ చేపట్టిన రాహుల్ గాంధీ.. అనర్హతపై తీవ్ర విమర్శలు

మమత బెనర్జీ ఆహ్వానం మేరకే తాను ఆ పార్టీలో చేరానని ఫెలీరో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చెప్పారు. తృణమూల్ అనే పదానికి తగినట్లుగా క్షేత్ర స్థాయి రాజకీయాలు నూతనత్వాన్ని సంతరించుకుంటాయని ఆశించి తాను ఆ పార్టీలో చేరానని, అయితే అనుకున్నట్లుగా ఏమీ జరగలేదని, అందువల్ల తాను తన రాజ్యసభ సభ్యత్వానికి, టీఎంసీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సదుద్దేశాలు ఉన్నప్పటికీ, ప్రణాళిక ప్రకారం ఏదీ జరగలేదని, పార్టీలో తనకు ముఖ్యమైన పదవులను ఇచ్చినందుకు మమత బెనర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Cow Urine: గోమూత్రం మనుషులకు హానికరం.. ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి

అయితే ఫెలీరో రాజీనామాపై టీఎంసీ సానుకూలంగా స్పందించింది. ఫెలీరో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు, గోవా ప్రజలకు ఆయన నిరంతరం సేవలందించాలని పేర్కొంది. ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నికలు జరిగినపుడు మరొక అభ్యర్థిని ప్రకటిస్తామని ప్రకటించింది. 2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్‌పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పార్టీకే చెందిన అర్పిత ఘోష్ చేత రాజ్యసభ సభ్యత్వానికి అప్పట్లో రాజీనామా చేయించారు. అనంతరం 2021లో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.