Kapil Sibal: అల్లర్లే లేకుంటే ఆ నంబర్లేంటి? అమిత్ షా వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ఫైర్

ధనామంత్రి నరేంద్రమోదీని 2024లో మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం. బిహార్‭లో ఉన్న 40 సీట్లకు 40 సీట్లు బీజేపీనే గెలవాలి. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2025) కూడా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో అల్లర్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

Kapil Sibal: అల్లర్లే లేకుంటే ఆ నంబర్లేంటి? అమిత్ షా వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ఫైర్

Kapil Sibal

Kapil Sibal: భారతీయ జనతా పార్టీ పాలనలో అల్లర్లే ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అబద్ధాలు మాత్రమే చెప్పే మోదీ ప్రభుత్వం చెప్పిన మరో అబద్ధమంటూ అమిత్ షా వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆరేళ్లలో జరిగిన 5,415 ఘటనలకు సంబంధించిన ఎన్‭సీఆర్‭బీకి ఎక్కడి నుంచి డేటా వచ్చిందని, ఆ డేటాను పార్లమెంట్ సాక్షిగా ఎందుకు చెప్పారంటూ సిబాల్ మండిపడ్డారు.

Rahul Gandhi: సూరత్ కోర్టుకు బయల్దేరిన రాహుల్.. తోడుగా ప్రియాంక, కాంగ్రెస్ సీఎంలు

బిహార్‭లోని నవాడా జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘ప్రధనామంత్రి నరేంద్రమోదీని 2024లో మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం. బిహార్‭లో ఉన్న 40 సీట్లకు 40 సీట్లు బీజేపీనే గెలవాలి. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2025) కూడా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో అల్లర్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని ఉల్టా పల్టా చేస్తాం. మేం అధికారంలో ఉన్న అసలు అల్లర్లే ఉండవు’’ అని అన్నారు.

Twitter Blue Tick: వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను కోల్పోయిన న్యూయార్క్ టైమ్స్.. మస్క్ ఎందుకలా చేశాడంటే?

కాగా, అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై సిబాల్ స్పందిస్తూ ‘‘బీజేపీ పాలనలో అసలు అల్లర్లే జరగలేదా? ఇది కదా పచ్చి అబద్ధం అంటే. అయినా ప్రతిరోజు అబద్ధాలు ప్రచారం చేసే వారికి ఇదొక అబద్ధపు ప్రచారం. 2014 నుంచి 2020 మధ్యలో 5,415 ఘటనలు జరిగాయని ఎన్‭సీఆర్‭బీ డేటా చెప్తోంది. ఒక్క 2019లోనే బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో 9 అల్లర్లు, మహారాష్ట్రలో 4 అల్లర్లు, మధ్య ప్రదేశ్ లో 2 ఘటనలు జరిగాయి. ఒక మొత్తంగా చూసుకుంటే బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలోనే ఎక్కువ అల్లర్లు జరిగాయి’’ అని అన్నారు.