KTR సీఎం పదవిపై KCR వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : January 25, 2020 / 01:25 PM IST
KTR సీఎం పదవిపై KCR వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి మార్పుపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలోక్తులతో నవ్వులు పూయించారు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది..కదా..బలవంతంగా రిజైన్ చేయిస్తారా ? అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. దేశం కోసం వెళ్లినా..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే ఉంటానని నేనే స్వయంగా చెప్పినా..ఇంకా నమ్ముతలేరా అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ పీఎం కాలేదా ? పోయినంక..ఖాళీ అయినంక..చూద్దాం..అంత తొందరెందుకని వ్యాఖ్యానించారు. నన్ను పంపించే ఉపాయం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మంచిగా కనిపించకపోతే..ఊకో అంటే..ఊకుంటా..ఊకేందెందుకు పంచాయతీ…ప్రజలేమో ఉండాలని అంటున్నారు. ఏం చేయాలే చెప్పు అన్నారు సీఎం కేసీఆర్. ఈ కండీషన్‌లో ఏం చేయాలో మీరే చెప్పాండంటూ నవ్వించారు.

కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్‌కు అప్పచెబుతారని, కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో TRS విజయం సాధించడంపై 2020, జనవరి 25వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్. 

ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సీఎం ఎవరు కావాలో..సందర్భాలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఎవరో కోరుకుంటే.. కాదన్నారు. దీనిపై పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సినవసరం లేదన్నారు. కుండబద్ధలు కొట్టినట్లు శాసనసభలో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఇటీవలే తాను అస్వస్థతకు గురి కావడం జరిగిందని, ఆస్పత్రికి రావాలని చెప్పడంతో తాను వెళ్లడం జరిగిందన్నారు.

20 సీసాల రక్తం తీసి మొత్తం చెక్ చేశారని తెలిపారు. గంటలో రిపోర్టు వచ్చాయని, అందులో దుక్కలాగా ఉన్నావని, ఫర్ ఫెక్ట్…ఆల్ రైట్ అని వైద్యులు చెప్పారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పాలని, జబర్దస్త్‌గా రాజీనామా చేయాలా అని నవ్వుతూ చెప్పారు సీఎం కేసీఆర్. మొత్తానికి సీఎం మార్పుపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. 

Read More : KCR హామీలు : త్వరలో నిరుద్యోగ భృతి