మున్సిపల్స్ : 9 కార్పొరేషన్లలో TRS జోరు

  • Published By: madhu ,Published On : January 24, 2020 / 01:41 PM IST
మున్సిపల్స్ : 9 కార్పొరేషన్లలో TRS జోరు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై CPS సర్వే జరిపింది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించింది. 120 మున్సిపాల్టీలో టీఆర్ఎస్ 104 నుంచి 109 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

కాంగ్రెస్ 0 నుంచి 4 స్థానాలు, బీజేపీ 0 నుంచి 2 స్థానాలు, MIM 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. 7 నుంచి 10 మున్సిపాల్టీలో పోటాపోటీగా ఫలితం ఉండే అవకాశం ఉందని తెలిపింది. 10 కార్పొరేషన్‌లలో టీఆర్ఎస్ 9 నుంచి 10, బీజేపీ 0 నుంచి 01 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10tv గ్రౌండ్ రిపోర్టు  చేసింది. 
తెలంగాణ రాష్ట్రంలో 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కారు జోరు కొనసాగిస్తుందని సర్వేలో తేలుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన విజయం సాధిస్తారని అంచనా వేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే గులాబీ విజయందుందుభి మ్రోగిస్తుందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఏ కార్పొరేషన్‌లో ఎలాంటి పరిస్థితి ఉందంటే..

నిజామాబాద్‌ జిల్లా : నిజామాబాద్ కార్పొరేషన్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా : రామగుండం కార్పొరేషన్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : బడంగ్‌పేట్‌ కార్పొరేషన్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
 

* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : మీర్‌పేట్ కార్పొరేషన్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : జవహర్‌నగర్ కార్పొరేషన్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఫీర్జాదిగూడ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
 

* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : బోడుప్పల్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : నిజాంపేట్ – టీఆర్ఎస్‌ గెలిచే అవకాశం
* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : బండ్లగూడ జాగీర్ – టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ

మొత్తం కార్పొరేషన్లు  9 : టీఆర్ఎస్‌ గెలిచే స్థానాలు – 8 త్రిముఖ పోటీ – 1

TRS గెలిచే కార్పొరేషన్లు : బడంగ్‌పేట, జవహర్‌నగర్,  ఫీర్జాదీగూడ, బోడుప్పల్, నిజాంపేట్, నిజామాబాద్. రామగుండం
త్రిముఖపోటీ ఉన్న కార్పొరేషన్ : బండ్లగూడ జాగీర్ (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ)