Rajasthan Politics: లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాజస్థాన్‭లో మెగా ప్రచారాన్ని ప్రారంభించున్న ప్రధాని మోదీ

మోదీ 9ఏళ్ల పాలన ముగించుకుని బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 51కి పైగా భారీ ర్యాలీలు, 500కు పైగా చోట్ల బహిరంగ సభలు, 500కి పైగా లోక్‌సభ, 4000 విధానసభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలకు బీజేపీ సిద్ధమైంది.

Rajasthan Politics: లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాజస్థాన్‭లో మెగా ప్రచారాన్ని ప్రారంభించున్న ప్రధాని మోదీ

#9YearsOfModiGovernment: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాజస్థాన్ చేరుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో సంబరాలు చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సహా లోక్‭సభ ఎన్నికలు లక్ష్యంగా రాజస్థాన్‭లో మెగా ప్రచారాన్ని మోదీ ప్రారంభించున్నారు. ఇక మధ్యహ్నం నిర్వహించే భోజన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి మోదీ భోజనం చేయనున్నారు.

మోదీ రాజస్థాన్ పర్యటనలోని ముఖ్య అంశాలు, బీజేపీ చేయనున్న కార్యక్రమాలు ఇవే..
రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్‌లో ఉన్న బ్రహ్మ దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు.
అజ్మీర్‌ నుంచి మహా జనసంపర్క్ అభియాన్‭ను ప్రారంభించనున్నారు. ఇది నేటి నుంచి జూన్ 30 వరకు జరగనుంది.
అజ్మీర్‌లోని కయాద్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై లోక్‭సభ నియోజక వర్గాలు, రాష్ట్రాల వారిగా బీజేపీ నివేదికలు తయారు చేసింది.
9 సంవత్సరాలలో రాష్ట్రాల వారిగా ప్రజలకు కేంద్రం నుంచి అందిన నిధులు పథకాల గురించి నివేదిక ద్వారా ప్రజల ముందు ఉంచనున్నారు.
కేంద్రంలో 9 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ.
రానున్న అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా కార్యక్రమాలు చేయనున్నారు.
గత ఎనిమిది నెలల్లో రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేపట్టిన ఆరో కార్యక్రమం ఇది.
8 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 45 అసెంబ్లీ స్థానాల నుంచి మోదీ సభకు రానున్న లక్షలాది ప్రజలు, కార్యకర్తలు రానున్నట్లు బీజేపీ తెలిపింది.