Karnataka CM: ఎన్నికల్లో గెలవడం కంటే సీఎంను ఎంపిక చేయడమే కష్టమైంది.. కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్న గత అనుభవాలు

ఛత్తీస్‌గఢ్‌లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్‌, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Karnataka CM: ఎన్నికల్లో గెలవడం కంటే సీఎంను ఎంపిక చేయడమే కష్టమైంది.. కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్న గత అనుభవాలు

Congress vs Congress: 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం.. వరుస అపజయాలతో కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతోంది. కొన్ని సార్లు ఆ పార్టీ కొన్ని గెలుపులు సాధించినా అవి మరీ అంతగా చెప్పుకోతగ్గవి ఏమీ కావు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం పాలైన కాంగ్రెస్ పార్టీకి మూడోసారి ఎన్నికలు సమీపంలోకి వచ్చాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం లభించింది. ఉత్తరాధిలో దాదాపు రాష్ట్రాల్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి.. దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అలాంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడమే కాకుండా, బీజేపీ కంటే రెండింతలు ఎక్కువ స్థానాలతో ఘన విజయం సాధించడం ఆ పార్టీకి అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

గెలవడం కాదు, ముఖ్యమంత్రిని నిర్ణయించడమే అసలు సమస్య
కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఆ పార్టీకి ఎన్నికల్లో గెలవడం కంటే ముఖ్యమంత్రిని నిర్ణయించడమే ప్రతీసారి పెద్ద సమస్యగా మారుతోంది. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే ఇదే ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంటుంది. దీని కారణంగా ఈ తొమ్మిది ఏళ్లలో కాంగ్రెస్ చాలా నష్టపోయింది కూడా. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్య తప్పడం లేదు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయమై పెద్ద గందరగోళం నడుస్తోంది. పార్టీని భుజాలకు ఎత్తుకొని విజయతీరాలకు తీసుకెళ్లిన సీనియర్ నేత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం ఫైట్ కొనసాగుతోంది. అధిష్టానం సైతం వీరిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తల పట్టుకుంది.

గతంలోని అనుభవాలు
రాజస్థాన్ రాష్ట్రంలో రెండుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈనాటికీ స్పష్టంగా కనిపిస్తుంటుంది. రాజస్థాన్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు అప్పటి పీసీసీ చీఫ్ సచిన్ పైలట్. అనంతరం సీఎం కుర్చీపై సీనియర్ నేత గెహ్లాట్, పైలట్ మధ్య పోటీ నడిచింది. అయితే గాంధీ కుటుంబం గెహ్లాట్‌కు మొగ్గు చూపి సీఎం చేసింది. అయితే ఇది పార్టీమీద తిరుగుబాటుకు దారి తీస్తుందేని కాంగ్రెస్ ఊహించలేదు. 2021లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యలతో తిరుగుబాటు చేశారు. అయితే గెహ్లాట్‌కు దాన్ని సంఖ్యాబలంతో బలంగా తిప్పికొట్టి తిరుగుబాటును అణచివేశారు. కానీ నేటికీ ఇరు పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.

Nikhil Siddhartha : అమిత్ షా నన్ను పిలిచారు.. రాజకీయం చేస్తారనే నేను కలవలేదు..

పంజాబ్‌లో రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూకి అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‭కి అస్సలు పడేది కాదు. అయితే ఈ విబేధాలకు ముగింపు చెప్పడానికి అమరీందర్‭ని సీఎంగా తొలగించి దళితుడైన చరణ్‭జిత్ సింగ్ చన్నీని చేసింది కాంగ్రెస్. కానీ 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీలో చేరారు. అనంతరం కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

PM Modi, Rahul Gandhi US Tour : ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలు ..

ఇక ఛత్తీస్‌గఢ్‌లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్‌, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అస్సాంలో మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‭తో ఉన్న విబేధాలు, ముఖ్యమంత్రి కుర్చీ కోసం చేసిన ప్రయత్నాల్లో విఫలమైన హిమంత బిస్వా శర్మ.. 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఒక్క మార్పు బీజేపీకి ఈశాన్య భారతాన్ని మొత్తం కట్టబెట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరీష్ రావత్ ఎంపిక అనంతరం పార్టీ దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది.

Karnataka CM: సిద్ధూ కాదు డీకే కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడో వ్యక్తి?

దాదాపుగా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు. అన్ని సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఇలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం వల్ల జాతీయ స్థాయి పార్టీలకు మంచిదే. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారంతో తమ బలాన్ని పెంచుకుంటారు. రాష్ట్రాల్లోని నాయకుల బలాన్ని తగ్గిస్తారు. వాస్తవానికి కాంగ్రెస్ ఈ విషయంలో గతంలో చాలా బలంగా ఉండేది కానీ, ఇప్పటి పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ గొడవల వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. ఇక తాజాగా కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ వల్ల అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చ లేక తల పట్టుకుని కూర్చుంది.