Konda Vishweshwar Reddy : కవితను అరెస్ట్ చేయాలని ప్రజల్లో ఉంది, రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తాం- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Revanth Reddy : మోస్ట్ సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు బీజేపీపైనే నమ్మకం ఉంది. మేము కాంగ్రెస్ లో కి రావడం కాదు.. ఆయనే బీజేపీలోకి రావాలన్నారు.

Konda Vishweshwar Reddy
Konda Vishweshwar Reddy – BJP : బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై హాట్ కామెంట్స్ చేశారు. కవితను అరెస్ట్ చేయాలని ప్రజల్లో ఉందన్నారు. కవితను అరెస్ట్ చేసే అధికారం బీజేపీకి లేదన్నారు. కవిత స్కామ్ చేసిందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారాయన. కవిత అరెస్ట్.. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
మోస్ట్ సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే మతానికి ఒకే కోడ్ ఉండకూడదని కామన్ సివిల్ కోడ్ తెస్తాం అంటున్నారని చెప్పారు. గుజరాత్ పార్టీ అని, మతతత్వ పార్టీ అని విమర్శలు చేస్తున్నారు.. కానీ, ఆర్ఎస్ఎస్ పుట్టింది నిజామాబాద్ లోనే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అన్ని విషయాలు తెలుసుకునే బీజేపీలో చేరానన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు బీజేపీపైనే నమ్మకం ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో.. కేకులు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ కి ఒరిగిందేమీ లేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
Also Read..Nizamabad Urban constituency: ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది.. గుప్త హ్యాట్రిక్ కొడతారా?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యం, బీజేపీ లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్ ను ఓడించడం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మేము కాంగ్రెస్ లో కి రావడం కాదు.. ఆయనే బీజేపీలోకి రావాలన్నారు. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తామన్నారు. చేరికల కమిటీ ఆయనను కలవలేదన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ పని చేయదని, పార్టీ బలోపేతం కోసం పని చేస్తుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. మునుగోడులో ఓడిపోయినా పార్టీ బలపడిందని సంబరాలు చేసుకున్నామని చెప్పారాయన.