Ashwayuja Masam 2021 : ఆశ్వయుజ మాసం ప్రారంభం, ఆశ్వయుజ మాసం విశిష్టత

త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతి దేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

Ashwayuja Masam 2021 : ఆశ్వయుజ మాసం ప్రారంభం, ఆశ్వయుజ మాసం విశిష్టత

Devi Navaraatri

Ashwayuja Masam 2021 : త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతి దేవిలకు అత్యంత ప్రీతికరమైన……వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం…ఆయుర్వేద దేవుడు అయిన ‘ ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !

ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు “దేవి నవరాత్రులు.” సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈనాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి. దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి , నవమిలలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది.
Also Read : Indrakeeladri: దసరాకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి

కలశ స్థాపనాదులతో పూజించలేని వారు , అమ్మవారి పటానికి గాని , విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు. ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది.

అలాగే , ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని , కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. పూర్ణిమ నాడు “నారదీయ పురాణము” ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను. పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి , అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.

ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం , మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం ఆశ్వయుజ మాసం.

ఈ మాసం లో చేసే పూజలు , విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !. తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి కరుణామయి..ఆ తల్లి !

శ్రీ ప్లవ నామ సంవత్సర శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు..

7-10-2021: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ శైలపుత్రి… స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవి గా..
8-10-2021: విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి..
9-10-2021: తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి..
10-10-2021: చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి..
11-10-2021: పంచమి, సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి గా, షష్ఠి న శ్రీ మహాలక్ష్మీ దేవిగా..
12-10-2021: శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)..
13-10-2021: శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి)..
14-10-2021: శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని (మహార్ణవమి)..
15-10-2021: శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి) గా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.