Maha Shivaratri: తిరుపతి మహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం

తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుక‌గా ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రగ‌నున్నాయి.

Maha Shivaratri: తిరుపతి మహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం

Maha Shivaratri

Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌ర‌, డోలు పాఠ‌శాల ఆధ్వర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుక‌గా ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రగ‌నున్నాయి. ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌రకు, తిరిగి మ‌ధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఈ సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

ముందుగా క‌ళాశాల‌, పాఠ‌శాల విద్యార్థుల ప్రార్థ‌న‌తో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, శ్రీ న‌ట‌రాజ‌స్వామికి పూజ‌లు చేశారు. మొద‌ట‌గా ఎస్వీ నాద‌స్వ‌రం డోలు పాఠ‌శాల విద్యార్థులు మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వ‌రం, డోలు వాయిద్య‌ సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆ తర్వాత మోహ‌న‌కృష్ణ‌, ప‌వ‌న్‌కుమార్‌, రూపేష్ (విద్యార్థులు) ప‌లు భ‌క్తిగీతాల‌ను బృంద‌గానం చేశారు. అనంత‌రం క‌ళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డా. ప‌ద్మావ‌తి, వారి శిష్యులు ల‌క్ష్మి, కె.పి.రాధిక బృందం వీనుల‌విందుగా భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

Car Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.17 లక్షల విలువైన కారు

ఆ తర్వాత వ‌యోలిన్ – మృదంగం వాద్య సంగీతం, గాత్ర సంగీతం, వేణువు – వీణ వాద్య సంగీతం, మృదంగ ల‌య విన్యాసం, నాద‌స్వ‌రం – డోలు వాద్య సంగీతం నిర్వ‌హించారు. అదే విధంగా, అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి పూర్ణా వైద్య‌నాథ‌న్ – వ‌యోలిన్‌, శ్రీ ఎల్‌.జ‌య‌రాం – వ‌యోలిన్‌, శ్రీ‌మ‌తి జి.జ్ఞాన‌ప్ర‌సూన‌-వీణ‌, శ్రీ ఎ.చెన్న‌య్య – వేణువు, శ్రీ బి.ర‌ఘురాం – మృదంగం వాద్య స‌మ్మేళ‌నం ఆక‌ట్టుంది.

Maha Shiva Ratri 2020 : శ్రీశైలం క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది

వీటితోపాటు అధ్యాప‌కులు శ్రీ ఎ.శ‌బ‌రి గిరీష్ గాత్ర సంగీతం, శ్రీ సి.హ‌ర‌నాథ్ శిష్య బృందం – భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌, శ్రీ ఎస్‌.మునిర‌త్నం – నాద‌స్వ‌ర వాద్యం, శ్రీ రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ఎం.నాగేశ్వ‌ర‌రావు, శ్రీ జి.చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీ సంప‌త్‌, శ్రీ సంకీర్త్‌, శ్రీ న‌రేంద్ర‌, శ్రీ లోకేష్ ల‌య‌విన్యాసం కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, అన్ని విభాగాల అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భక్తులు మహాదేవుడిని ప్రతిరోజూ స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. ఆద్యంత రహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివిదీరదంటూ పక్షానికి, మాసానికీ, సంవత్సరానికీ.. ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను అభిషేకిస్తారు. వాటన్నింటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి మహా శివరాత్రి (మార్చి 1- మంగళవారం).

మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు ప్రతిఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోషవేళ శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం.