Sai Baba Temple : జై సాయి…షిరిడీ సాయిబాబా దర్శనం

షిరిడీ సాయిబాబు 2021, అక్టోబర్ 07వ తేదీ నుంచి భక్తులకు నేరుగా దర్శనమిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేశారు.

Sai Baba Temple : జై సాయి…షిరిడీ సాయిబాబా దర్శనం

Saibaba

Shirdi Sai Baba : షిరిడీ సాయిబాబు 2021, అక్టోబర్ 07వ తేదీ నుంచి భక్తులకు నేరుగా దర్శనమిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేశారు. మహారాష్ట్రలో కరోనా అదుపులోకి రావడంతో షిరిడీలో దర్శనాలు మొదలయ్యాయి. దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా… షిరిడీ సాయి దర్శనాలకు అనుమతి ఇచ్చారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి 17న మూతపడి నవంబర్ 16న తెరచుకున్న షిరిడీ సాయి దేవాలయం.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన మరోసారి దర్శనం నిలిపివేశారు. కరోనా అదుపులో ఉండడం.. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున షిరిడీ ఆలయం తెరచి భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు.

Read More : Indrakeeladri: ‘తిరుమల స్థాయిలో ఇంద్రకీలాద్రి.. రూ. 75 కోట్లతో అభివృద్ధి’

భక్తుల రద్దీని నివారించేందుకు ప్రతిరోజు 15 వేల మందికి మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా 5వేల మందికి, ఆఫ్‌లైన్‌ ద్వారా 5 వేల మందికి, పెయిడ్ పాసుల ద్వారా మరో 5 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. గంటకు 1150 మంది చొప్పున దర్శనాలు చేసుకునే అవకాశం ఉందన్న ఆలయ ట్రస్ట్… హారతి సేవకు 90 మందిని మాత్రమే అనుమతించారు. అయితే… కోవిడ్ నిబంధనల మేరకు భక్తుల తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు, 65ఏళ్లు దాటిన వారికి అనుమతి లేదని చెప్పింది.